కొత్తూరు, అక్టోబర్ 3: మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీకి సకల హంగులతో నిర్మించిన నూతన భవనాన్ని అదేవిధంగా రెండు బ్లాకులుగా నిర్మించిన 60 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ఈ నెల ఐదోతేదీన ప్రారంభించనున్నారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అవసరమైన నిధులను మంజూరు చేసి పనులు త్వరగా జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ఐటీ, పురపాలక శాఖల మంత్రికి మున్సిపాలిటీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హామీలను నెరవేర్చడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడుతున్నారు.
కొత్తూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ భవనాన్నే మున్సిపల్ కార్యాలయంగా మార్చారు. అయితే ఇరుకైన భవనంలో పరిపాలనకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం లేకపోవడంతో అధికారులతోపాటు పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే పురప్రజలు కూడా ఇబ్బందిపడ్డారు. వీటిని గమనించిన మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 3.5 కోట్లతో 2.5 ఎకరాల విశాల ప్రాంగణంలో సకల హంగులతో జీప్లస్ వన్ అంతస్తులో భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో సిటిజన్ సర్వీస్ సెంటర్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్, అ కౌంట్స్, టౌన్‌ప్లానింగ్, నీటిసరఫరా, కమిషనర్ కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో మున్సిప ల్ చైర్పర్సన్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. సమావేశ కార్యాలయాన్ని విశాలంగా నిర్మించారు. రెండు ఎకరాల్లో భవనం, పార్కింగ్ కోసం స్థలాన్ని వదిలారు. మరో అర ఎకరంలో గ్రీనరీని ఏర్పాటు చేశారు.
మంత్రి కేటీఆర్ గురువారం నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు 60 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పాప్రస్ పోర్డు పరిధిలో అర ఎకర స్థలంలో రెండు బ్లాకుల్లో 60 ఇండ్లను నిర్మించారు. మొదటి బ్లాకు లో 32 ఇండ్లు, బీ బ్లాకులో 28 ఇండ్లను నిర్మించా రు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల 4 వేలను కేటాయిం చారు. 60 ఇండ్లకోసం రూ. మూడు కోట్ల వరకు ఖర్చు చేసి సకల హంగులతో నిర్మించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతోపాటు విద్యుత్తు సదుపాయాన్ని కల్పించారు. హైవేనుంచి ఈ ఇండ్ల వరకు నూతనంగా రోడ్డును ఏర్పాటు చేశారు. కాగా ము న్సిపల్ కార్యాలయ పనులు త్వరగా జరిగేలా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య పర్యవేక్షించారు. అధికారులను సమన్వయం చేసుకుని నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. రేపు జరుగనున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లనూ ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారం మరువలేనిది. నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయానికి నిధుల మంజూరులో ఆయన ప్రత్యేక చొర వ తీసుకున్నారు. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు సంబంధించిన సమస్యను కూడా ఆయనే పరిష్కరించారు. ఆయన సహకారంతో ము న్సిపల్ను మరింత అభివృద్ధి చేస్తా. ఇప్పటికే ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను నాయకులు , ప్రజాపతినిధులు, ముఖ్యనాయకులకు స్వయంగా కలిసి అందజేశాం.
– బాతుక లావణ్యాదేవేందర్, మున్సిపల్ చైర్పర్సన్ కొత్తూరు