భీమ్‌గల్, అక్టోబర్ 5 : పోలీసులు తరచూ వేధిస్తుండటంతో ఓ టీస్టాల్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. బాధిత కు టుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమ్‌గల్ పట్టణంలోని దేవాంగపల్లికి చెందిన పొలాస సుధాకర్ స్థానిక బస్టాండ్ సమీపంలో టీ కొట్టు పెట్టుకుని చాయ్, సిగరెట్లు, పాన్ మసాలా అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 10 గంటల తర్వాత విక్రయా లు చేస్తున్నావని పలుమార్లు జరిమానా విధించడంతో చెల్లించాడు. రెండురోజుల క్రితం మళ్లీ ఫైన్ వేయగా.. చెల్లించేందుకు సుధాకర్ సోమవా రం స్టేషన్‌కు రాగా కేసు నమోదు చేశామని, కోర్టులో చెల్లించాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన సుధాకర్ ఠాణా ఆవరణలోనే పెట్రో ల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడినుంచి ప్రైవేట్ దవాఖానలో తరలించారు.
ఎస్సై తిరుపతి పలుమార్లు జరినామా విధించారని కొంత కాలంగా ఒక వ్యాపారితో పాటు కొందరు విలేకరులు వేధిస్తున్నారని, ఫైన్ విషయంలో ఎంత బతిమాలినా వినలేదని, దీంతో గత్యంతర లేక ఘాతుకానికి ఒడిగట్టినట్టు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలతోపాటు దేవాంగ సంఘ స భ్యులు పోలీసుస్టేషన్ ఎదుట రాస్తారోకో చేశా రు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. బాధితుడి షాప్‌నకు ఎదురుగా ఉన్న ఓ కిరాణా షాప్ యజమాని తన వద్ద సిగరెట్లు కొనడం లేదనే కోపంతో సుధాకర్ దగ్గరికి ఇద్దరు రిపోర్టర్లను పంపి బెదిరించాడని తెలిపారు. లేట్ నైట్‌లో షాప్ నడిపిస్తున్నాడని పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారన్నారు.
ఎస్సై తిరుపతి వేధింపుల వల్లే సుధాకర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుకొంటూ బతికే ఒక సామాన్యుడిని పోలీసు అధికారి ప్రాణాల మీదికి తెచ్చే స్థాయికి వేధించడం గర్హనీయమని ఓ ప్రకటనలో మండిపడ్డారు. డబ్బు వసూళ్లు, ఇసుక వ్యాపారులతో దందాలు, అమాయకులను ఠాణాకు పిలిపించి దౌర్జన్యాలు చేయడం ఎస్సై నిత్యకృత్యంగా మార్చుకున్నాడని ఆరోపించా రు. ఈ అరాచకాలపై గతంలో పలుమార్లు సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే బరితెగించాడని విమర్శించారు. సుధాకర్ వైద్యానికి ఇప్పటికే రూ.80 వేలు ఖర్చయ్యాయని, తన వంతు తక్షణ సా యంగా రూ.50 వేలను అందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తదుపరి వైద్య ఖర్చులను ప్రభుత్వం, పోలీసులే భరించాలని డి మాండ్ చేశారు. ఎస్సై తిరుపతిని డిస్మిస్ చే యాలని డిమాండ్ చేస్తూ రేపు భీమ్‌గల్ బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలు మితిమీరిపోయాయని తెలిపారు. భీమ్‌గల్ ఎస్సైతో పాటు బాల్కొండ ఎస్సై శైలేందర్, మోర్తాడ్ ఎస్సై రాము కూడా చర్యలు తీసుకోవాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.