శత వసంతాల..కోఠి కళాశాల
చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందేండ్లు పూర్తికానున్నాయి.
- కోఠి మహిళా కళాశాలకు వందేండ్లు
- 1924లో పీయూసీ హ్యుమానిటీస్ కోర్సులతో షురూ
- ప్రస్తుతం 77 అండర్ గ్రాడ్యుయేట్,20 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు
- తొలి తెలంగాణ మహిళా యూనివర్సిటీగా గుర్తింపు
- సెప్టెంబర్ నుంచి శతాబ్ది ఉత్సవాలు
- నిర్వహణకు అధికారుల సన్నాహాలు
- కాలేజీని వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందేండ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మహిళా సాధికారత సాధనలో భాగంగా నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ఠాగూర్ పిలుపు మేరకు 1924లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలేజీని ప్రారంభించారు. తొలుత నాంపల్లి గోల్డెన్ త్రెషోల్డ్ భవనంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో పీయూసీ హ్యుమానిటీస్ కోర్సులతో షురూ చేశారు. ఆ తర్వాత 1935లో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. తదనంతరం ఆర్ట్స్, సామాజిక శాస్ర్తాల్లో డిగ్రీ కోర్సులను తీసుకొచ్చారు. ప్రస్తుతం డిప్లొమాలో 77 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 20 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను నిర్వహిస్తున్నారు.
నాడు ఏడుగురు అధ్యాపకులతో ప్రారంభం
1924లో ఈ కాలేజీని ఏడుగురు అధ్యాపకులతో ప్రారంభించారు. 1950లో కోఠిలోని ప్రస్తుత క్యాంపస్‌లోకి మార్చారు. 1803లో కోఠిలో నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీ అంతర్భాగంగా 63 ఎకరాల్లో కాలేజీని నడిపారు. ఆ తర్వాత, కొంతస్థలాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకివ్వగా, ప్రస్తుతం 42 ఎకరాల విశాలమైన స్థలంలో కాలేజీని నిర్వహిస్తున్నారు. 220 ఏండ్ల నాటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం ఈ వర్సిటీకి ప్రధాన ఆకర్షణ కాగా, ఇది వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ హెరిటేజ్ బిల్డింగ్ జాబితాలో ఒకటిగా నిలిచింది. గత ఏడాది ఈ కాలేజీని రాష్ట్రంలో తొలి తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. వైస్ చాన్స్‌లర్‌ను కూడా నియమించింది. ప్రఖ్యాత బయో టెక్నాలజిస్ట్ డాక్టర్ కైజర్ జమీల్, కర్ణాటక ప్రభుత్వ మాజీ సీఎస్ రత్నప్రభ, ఈపీటీఆర్ఐ డీజీ ఐఏఎస్ అధికారి వాణీప్రసాద్, ప్రస్తుత ఇన్చార్జి వీసీ విజ్జులత తదితరులు ఈ కాలేజీ పూర్వ విద్యార్థులే కావడం గమనార్హం.
ఏడాది పొడవునా కార్యక్రమాలు
మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాలను ఈ సెప్టెంబర్‌లో ప్రారంభించి ఏడాది పొడవునా నిర్వహిస్తాం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం. కాన్వకేషన్, వార్షికోత్సవం, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఉంటాయి. వాకథాన్, రన్లు, సదస్సులు, వర్క్‌షాప్‌లు ఏడాది పొడవుగా నిర్వహించాలని భావిస్తున్నాం.
-విజ్జులత, ప్రొఫెసర్, ఇన్చార్జి వీసీ
కాలేజీ ప్రత్యేకతలు
- అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో 5వేల మంది విద్యార్థినులు ఈ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు.
- ఈ కాలేజీ ఫైవ్‌స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. న్యాక్ ఏ గ్రేడ్‌ను పొందింది.
- 1989 సంవత్సరంలో ఈ కాలేజీకి స్వయం ప్రతిపత్తిహోదా కల్పించారు.
- 1989 కాలంలోనే బీకాం ట్యాక్సేషన్, బీకాం హానర్స్, బీకాం కంప్యూటర్స్, ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను ప్రవేశపెట్టారు.
- 2014 -15 సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను ప్రవేశపెట్టారు.
- కాలేజీలో రిసెర్చ్, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఫిజిక్స్ విద్యార్థులు ఐఐటీ బాంబే నిర్వహించిన రోబోటిక్స్ పోటీల్లో జోనల్ స్థాయికి, సెమీ ఫైనల్‌కు ఎంపికై సత్తా చాటారు.
- బేకింగ్ అండ్ ఫొటోగ్రఫీలో షార్ట్‌టర్మ్ మాడ్యులర్ కోర్సులు, ఇన్సూరెన్స్‌లో సర్టిఫికెట్ కోర్సులు, సెరికల్చర్, మష్రూమ్ కల్టివేషన్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రిజర్వేషన్, డెస్క్‌టాప్ ప్రింటింగ్ వంటి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టారు.
- అండ్రాయిడ్ అప్లికేషన్స్‌పై స్వల్పకాలిక ప్రోగ్రామ్‌లను, త్రీడీ, గేమింగ్‌లో ఇంటర్ డిసిప్లినరీ విధానంలో సెమినార్లు, వర్క్‌షాప్‌లను కాలేజీ విజయవంతంగా నిర్వహించింది.
- ఈ కాలేజీలో 29 డిపార్ట్మెంట్లు, 110 తరగతి గదులు, 49 సైన్స్ ల్యాబ్‌లు, 2 గ్రీన్ హౌజెస్, బిజినెస్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైకాలజికల్ కౌన్సెలింగ్ ల్యాబ్, స్పోర్ట్స్ ల్యాబ్‌లున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

