పరిగి, ఆగస్టు 22 : పరిగి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల మహేశ్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి పరిగికి వచ్చిన ఎమ్మెల్యేకు పూడూరు మండలం మన్నెగూడ నుంచి ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, గండీడ్, చౌడా పూర్, మహ్మదాబాద్ మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. మన్నెగూడ నుంచి పరిగి వరకు పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. పరిగిలోని నివాసం వద్ద ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులకు తల్లి గిరిజాదేవి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తల్లిదండ్రులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి-గిరి జాదేవిల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు పరిగిలో పార్టీ నాయకులు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు. అడుగడుగున పార్టీ నాయ కులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో సన్మానం చేసి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేందర్, హరికృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, గోపాల్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీల మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పూడూరులో..
పూడూరు, ఆగస్టు 22: పూడూరు మండలం హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డుపై పరిగికి వెళుతున్న ఎమ్మెల్యేతో మన్నెగూడ చౌరస్తా వరకు కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో పటాకులు కాల్చి నృత్యాలు చేశారు. చౌరస్తా వద్ద పలువురు పార్టీ శ్రేణులు గజమాల, శాలువాలు వేసి సన్మానించారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్వాగతం పలికి సన్మానించిన పార్టీ నాయకులకు అభివాదం చేశారు. మహేశ్‌రెడ్డికి మరొ సారి టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు పూడూరు మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. జరిగే ఎన్నికల్లో అధిక మెజార్టీని మండలం నుంచి మహేశ్‌రెడ్డికి కానుకగా ఇస్తామని మండల ఎంపీపీ మల్లేశం, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారొద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, రహిస్ఖాన్, బార్లపల్లి రాం చంద్రా రెడ్డి, సర్పంచులు అనంతరెడ్డి, వినోద్‌గౌడ్, నర్సింహరెడ్డి, ఎస్డి.అదిల్, నవీన్‌రెడ్డి, సీహెచ్ నర్సింహ, హరీశ్వర్‌రెడ్డి, కె.ప్రవీణ్, జె.నర్సింహులు, బి. విఠలయ్య, అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల నుంచి …
కులకచర్ల, ఆగస్టు 22 : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి టికెట్ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కులకచర్ల, చౌడాపూర్ మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్ల ర్యాలీ ద్వారా బయలుదేరారు. కులకచర్ల మండల కేంద్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, కులకచర్ల, చౌడాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.