ఏప్రిల్ 2 నుంచి కొడంగల్ వేంకటేశ్వరుడి
కొడంగల్ శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరుడి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే పూజా విధానాన్నే ఇక్కడ పాటించడం ఈ ఆలయం ప్రత్యేకత.
- తొమ్మిది రోజులపాటు జరుగనున్న ప్రత్యేక కార్యక్రమాలు
- ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్న ఆలయ నిర్వాహకులు
కొడంగల్, మార్చి 22 : కొడంగల్ శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరుడి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే పూజా విధానాన్నే ఇక్కడ పాటించడం ఈ ఆలయం ప్రత్యేకత. అర్చకులు విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి వైఖానస ఆగమన పద్ధతినే పాటిస్తూ కైంకార్యాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగిన ఎన్ఏకే సుందరవరద భట్టాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఖానుసాగమ సలహాదారుడిగా గౌరవాన్ని పొందారు. ఆయన నేతృత్వంలో గత 40 ఏండ్లుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఆయన పరమపదించడంతో వారి కుటుంబసభ్యులు స్వామివారికి నిత్యసేవలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా ఫాల్గుణమాసంలో తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు సాక్షాత్తు తిరుమల తిరుపతిలో ఆ తరుమలేశుడికి నిత్యపూజలు నిర్వహించే అర్చకుల నేతృత్వంలో జరుగడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. వచ్చేనెల 2వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో రోజువారీ కార్యక్రమాలివే..
రెండో తేదీన తిరుమంజనం, మూడున సేనాధిపతి ఉత్సవం, నాలుగున ధ్వజారోహణం, ఐదోతేదీన చిన్న శేషవాహనం, ఆరోతేదీన సింహవాహనం, ఏడోతేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూమపాల వాహనం, ఎనిమిదో తేదీన మోహినీ అవతారం, గరుడోత్సవం (లంకాదహనం) తొమ్మిదో తేదీన హనుమంత వాహనం, వసంతోత్సవం, పదోతేదీన సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12 పల్లకి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజారోహణం.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

