కొడంగల్, అక్టోబర్ 16 : అభివృద్ధి పేరిట సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) సభ్యులు మండిపడ్డారు. కొడంగల్‌కు మంజూరైన విద్యాలయాలను నియోజకవర్గంలోని లగచర్లకు తరలించే చర్యల్లో సీఎం ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గురువారం కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ కళాశాలలతోపాటు సమీకృత గురుకులాల తరలింపును నిరసిస్తూ కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సంపూర్ణమైంది. స్థానికు లు, వ్యాపారులు తమ సంస్థలను స్వచ్ఛందంగా మూసేసి రోడ్డుపైకి వచ్చి పట్టణంలో ర్యాలీ తీసి నిరసన తెలిపారు. మండలంలోని పర్సాపూర్‌లోని పాలమూరు-చించోలి హైవే 167పై రాస్తారోకో నిర్వహించారు.
దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి స్థానికులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలిలో ఏర్పా టు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డిని సీఎం ను చేసినా కొడంగల్ ప్రజలకు నిరాశే మిగులుతున్నదన్నారు. ముఖ్యమంత్రి తమ ప్రాంత వారు కావడంతో కొడంగల్ సెగ్మెంట్ ఎంతో ప్రగతిపథంలో ముందుంటుందని భావించామని.. కానీ, నోటి కాడి కూడును లాక్కోనేలా అభివృద్ధి పనులను మంజూరు చేసినట్లే చేసి గ్రామీణ ప్రాంతాలకు వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ కళాశాలలతోపాటు సమీకృత విద్యాలయాలను దుద్యాల మండలంలోని లగచర్లకు తరలించడాన్ని కొడంగల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. లగచర్లలో ఫ్యాక్టరీల ఏర్పా టు పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, అదేవిధంగా కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు పచ్చటి పంటలు పండే భూములను తీసుకున్నదని.. అప్పాయిపల్లి, పాతకొడంగల్ ప్రాంతంలో సమీకృత గురుకులాల ఏర్పాటుకు భవన నిర్మాణ పనులనూ ప్రారంభించినట్లు తెలిపా రు.
కానీ, గత నెల రోజులుగా ఆ పనులను పూర్తిగా నిలిపేసి, వాటిని లగచర్ల ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపించారు. కొడంగల్‌కు మంజూరైన విద్యాలయాలను లగచర్లకు ప్రభుత్వం ఎందుకు తరలిస్తుందో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు కేవలం రూ.10 లక్షలు నష్టపరిహారం అందించి హుటాహుటిన మెడికల్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించిందని.. మెడికల్ కాలేజీ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించే రైతులు తమ భూ ములను సర్కార్‌కు అప్పగించినట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు కళాశాలను ఇతర ప్రాంతానికి తరలిస్తే, భూములిచ్చిన రైతులు భూములను కోల్పోవడంతో పాటు ఉపాధి కూడా వారికి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నూ కొడంగల్‌కు మంజూరైన బస్ డిపో, ఇంజినీరింగ్ కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. పాలకులకు కొడంగల్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నదా..? లేదా..? అని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజ లు ఈ స్థాయిలో ఆందోళన తెలుపుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడంలేదని.. విద్యాలయాల తరలింపుపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గాభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి కట్టుగా పోరాటం చేస్తామన్నారు. నిరసనలో కేడీపీ జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, సురేశ్‌కుమార్, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రావు యాద వ్, నవాజోద్దిన్, రమేశ్‌బాబు, మోహన్‌రావు, కృష్ణాయాదవ్, వ్యాపార సంస్థల యజమానులు, పట్టణ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.