King Cobra | మేడ్చల్, ఏప్రిల్ 17 : నాగుపామును చూస్తే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఆ పాము సంచరిస్తున్న సమీప ప్రాంతాల్లో ఉండకుండ దూరంగా పరుగెడుతాం. మరి అందరికి వణుకు పుట్టించే నాగుపాము.. ఓ గన్నేరు చెట్టుపైకి ఎక్కింది. అదేదో ఊరికే చెట్టుపై ఉండలేదు. మరీ పడగ విప్పి కూర్చుంది. ఇక పడగ విప్పిన నాగుపాము మార్నింగ్ వాకర్స్ కంట పడింది. ఇంకేముంది వాకర్స్ ఆ నాగుపామును తమ సెల్ఫోన్లలో బంధించి వైరల్ చేశారు. భారీ నాగుపామును చూసేందుకు సమీప ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ఘటన మేడ్చల్ పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్ 100 ఫీట్ల రోడ్డులో చోటు చేసుకుంది.