వైరా, ఫిబ్రవరి 26: వైరా పట్టణం అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఖమ్మం నగరానికి సరితూగేలా ప్రగతి మార్గం పట్టింది. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అప్పట్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధితో వైరా రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి విస్తరణ వైరా పట్టణానికి నయా లుక్‌ను తీసుకొచ్చింది. ఎటు చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఖమ్మంలో మాదిరిగానే వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు వైరాకు కొత్త హంగును తీసుకురానున్నాయి. మొత్తంగా రూ.21.60 కోట్ల నిధులతో వైరా గుమ్మాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వైరా పట్టణంలో రూ.20 కోట్ల పీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, ఆర్అండ్బీ శాఖ కింద రూ.4.10 కోట్ల నాన్‌ప్లాన్ నిధులతో సైడ్ కాలువలు, రూ.4.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. మున్సిపాలిటీ పరిధిలో 308 సీసీ రోడ్లు ని ర్మించాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే 250 సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 58 సీసీ రోడ్లకు భూమి చదును చేసి వెట్‌మిక్స్ వేశారు. మధిర రోడ్డులో ఇరువైపులా 600 మీటర్ల దూరం సైడ్డ్రైనేజీను నిర్మించే పనులను చేపడుతున్నారు. మధిర క్రాస్‌రోడ్డును రింగ్‌రోడ్డుగా అభివృద్ధి పరిచి వాటర్ఫౌంటైన్తో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. వైరాలోని జాతీయ రహదారిపై డ్రైనేజీ ని ర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2018 లో వైరాలోని జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మించేందుకు ఆర్అండ్బీ శాఖకు చెందిన నాన్‌ప్లాన్ నిధులు రూ.4.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గత 15 రోజుల క్రితం పనులను ప్రారంభించారు.వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం ఖమ్మం తరహాలో వైరా న డిబొడ్డున రూ.4.50 కోట్ల తో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కె ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించింది. ఇప్పటికే పుట్టింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణ పనులను నాణ్యతతో 5 నెలల్లో పూర్తి చేయనున్నారు.
గిరిజన నియోజకవర్గమైన వైరాను మరింత అభివృద్ధి చేసి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైరా నియోజకవర్గం అన్ని రం గాల్లో అభివృద్ధి చెందుతోంది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవన నిర్మాణం పూర్తయితే వైరాకు కొత్త కళ రానుంది.
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతుండటంతో రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం రూ.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. దీంతో ప్రతి అంతర్గత రోడ్డు.. సీసీ రోడ్డుగా అభివృద్ధి చెందుతోంది. సైడ్ డ్రైన్ల నిర్మిస్తుండడంతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఒకేచోట అన్ని రకాల సరుకులు లభిస్తాయి.
– సూతకాని జైపాల్, మున్సిపల్ చైర్మన్, వైరా
వైరాలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ మార్కెట్ భవన నిర్మాణాన్ని 5 నెలల్లో పూర్తిచేస్తాం. ఇప్పటికే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. ఫుట్టింగ్ నిర్మాణాలను పూర్తిచేశాం. అతి త్వరలో ఇతర నిర్మాణ పనులను పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తాం. ఈ భవన నిర్మాణం పూర్తయితే 102 దుకాణాలు ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉంటాయి. -కే. నవీన్ డీఈ