తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖ రాలకు చేర్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉద యం నుంచే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేసి పటాకులు కాల్చి.. ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలంగాణ జాతిపిత నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆస్పత్రుల వద్ద రోగులకు పండ్ల పంపిణీతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో అధినేత పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాద వ్, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కేక్‌కట్ చేశారు. అదేవిధంగా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి చేశారు. షాబాద్ మండలంలోని ముద్దంగూడలో ఆ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి పొలాల్లో రైతులతో కలిసి కేక్ కట్ చేశారు.
అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధి, ధన్నారం సమీపంలోని యజ్ఞ ఫౌండేషన్‌లో చిన్నారులతో కలిసి కేసీఆర్ జన్మదినాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అంతకుముందు వారు వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మొక్క నాటారు. పరిగి మాజీ ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పార్టీ అధినేత పుట్టిన రోజును పురస్కరించుకుని పరిగి లో మొక్క నాటారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశా రు.
అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కొడంగల్‌లో కేక్ కట్ చేయడంతోపాటు స్థానిక ఆస్పత్రిలో మొక్కను నాటి.. అనంతరం రోగులకు పండ్లు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేసీఆర్ మనసున్న మారాజు అని.. రాష్ర్టాన్ని సాధించిన కారణజన్ముడు అని కొనియాడారు. అన్నివర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని.. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాలకూ మేలు చేశారన్నారు. కేసీఆర్ నిండు నూ రేండ్లు జీవించాలన్నారు. రాష్ర్టాన్ని సాధించడంతోపాటు పదేండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపారన్నారు.