ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17 : దేశం మెచ్చిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన ఫొటోతో ఏర్పాటు చేయించిన భారీ కేక్‌ను కట్ చేయించి బీఆర్ఎస్ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, సాధించిన తెలంగాణను అతి తక్కువ కాలంలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, మాజీ వైస్ చైర్మన్ యాదగిరి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మాజీ ఎంపీటీసీ భరత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ నిండు నూరేళ్లు
వికారాబాద్ : వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మొక్కలు నాటారు. అనంతరం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం సమీపంలోని యజ్ఞ ఫౌండేషన్‌లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. కేక్‌ను విద్యార్థులకు పంచిపెట్టారు.
ఈ సందర్బంగా కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పదిమందికి ఉపయోగపడేలా మొక్కలు నాటడం, అన్నదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, నాయకులు పాల్గొన్నారు.
కడ్తాల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణజన్ముడని కల్వకుర్తి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు గుర్క జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు కడారి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో పెద్దఎత్తున పటాకులు కాల్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కేక్‌లు కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులకు తినిపించారు.
అనంతరం మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమంలో నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు.
వాతావరణంలో సమతుల్యతను కాపాడటానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్న సంతోశ్‌కుమార్, లక్ష్మీనర్సింహారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ ఎల్ఎన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నిర్మల, రైతు సంఘం జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు, కోనాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ పాల్గొని నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ, లాంగ్ లివ్ కేసీఆర్ నినాదాలు చేశారు. తదనంతరం మొక్కలు నాటారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. కేసీఆర్ ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీని శక్తివంతంగా తయారు చేసి తెలంగాణను పరిరక్షించాలన్నారు.
తెలంగాణను ఏవిధంగా అయితే కేసీఆర్ సాధించారో, అభివృద్ధి కోసం ఎంత పరితపించారో.. తెలంగాణ కోసం అలాగే నిలబడి కొట్లాడుతారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస్‌రెడ్డి ఆమనగల్లు పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిర్మల, మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్‌రావు, నేనావత్ పత్యానాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరంజన్‌గౌడ్, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులున్నారు.
షాద్‌నగర్‌టౌన్ : పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్‌ను మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కట్ చేయడంతోపాటు మొక్కలను నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా పట్టణ ముఖ్య కూడలి వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య కూడలిలో పెద్దఎత్తున పటాకులు కాల్చి కేక్ కట్ చేశారు. అంతకు ముందు వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతిభ జూనియర్ కళాశాలలో విద్యార్థినులతో కలిసి మొక్కలను నాటారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలోని రోగులకు పాలు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసి దశాబ్దాల కలను సాకారం చేసిన జాతిపిత కేసీఆర్ అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా చీపిరి రమేశ్‌యాదవ్, సింగపాగ వెంకటేశ్ కేక్ కట్ చేసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, జామెట్రీ బాక్స్‌లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, సహకార సంఘం మాజీ చైర్మన్ రాజావరప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొడంగల్ : ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెల్లో నిలుపుకొంటారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేయడంతోపాటు స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రిలో మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి బాటలు వేసి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలోనే నం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రజలు, రైతుల కష్టాలను స్వయంగా గుర్తించి ఎవరూ అడగకున్నా చరిత్రను సృష్టించే ఎన్నో అద్భుత పథకాలను అందించి బాసటగా నిలిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహిపాల్, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, అడ్వకేట్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిగి : ఆరు దశాబ్దాల కలను సాకారాం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగిలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరో చెరిపేయాలనుకుంటే చెరిగిపోయేది కాదని, తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవిందరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజహరుద్దీన్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. అంతేకాకుండా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులున్నారు.