పరిగి, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం మరో చక్కటి కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లాలోని పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రారంభించడంతోపాటు వర్చువల్ విధానంలో 8 జిల్లాల్లో ప్రారంభిస్తారు.
వికారాబాద్ జిల్లా పరిధి లో 2396 మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయ నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభం కానుంది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్‌లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్, ఒక కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ అందిస్తారు. ఈ మేరకు జిల్లా పరిధిలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభానికి పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
పెద్దేముల్ పీహెచ్‌సీకి 120 కిట్లు
పెద్దేముల్, డిసెంబర్ 20: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భి ణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు పెద్దేముల్ పీహెచ్సీ డ్రాయింగ్ ఆఫీసర్ డాక్టర్ పవిత్ర మంగళవారం వెల్లడించారు. మంగళ వా రం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న సుమారు 120 కిట్లను ఓ ప్రత్యేకమైన గదిలో నిల్వ ఉంచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు నెలల గర్భవతులుగా ఉండి రెండు సార్లు డాక్టర్ పరీక్ష పూర్తి చేసుకున్నవారికి ఫస్ట్ కిట్లను పీహెచ్‌సీల్లో, ఏడు నెలల్లో ఉన్న గర్భ వతులకు జిల్లా దవాఖానాల్లో పరీక్ష చేయించుకొన్నవారికి సెకండ్ కిట్లను జిల్లా దవాఖాల్లో పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ పుష్పలత,పీహెచ్ఎన్ అరుణ కుమారి, ఎంపీహెచ్ఏ హరిశంకర్, స్టాఫ్ నర్స్ స్వరాజ్, ఏఎన్ఎం సమాధాన ,ఫార్మసిస్ట్ వినోద పాల్గొన్నారు.