వైభవంగా.. గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణం
మండల కేంద్రంలో కొలువైన భూనీలాసహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరాణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు.
- మామిడాకు తోరణాలతో ఆలయ అలంకరణ
- భక్తులకు తీర్థప్రసాదాలు అందజేత
- పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొన్న భక్తులు
కడ్తాల్, జనవరి 13 : మండల కేంద్రంలో కొలువైన భూనీలాసహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరాణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామి వారికి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించి, ఆలయ ప్రధాన అనువంశీకుల అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పూలహారాలతో గోదాదేవి, రంగానాథస్వామి వారి విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు.
స్వామి వారికి పట్టు వస్ర్తాలను బాచిరెడ్డి మంజుల, నరేందర్‌రెడ్డి దంపతులు సమర్పించగా… పుస్తె మెట్టెలను గూడూరు శారద-భాస్కర్‌రెడ్డి, కాసోజు మాధవి-రమేశ్‌చారి దంపతులు అందజేశారు. అనంతరం తిరునగరి భానుప్రసాద్, పెరుంబదూరు లక్ష్మాణాచార్యుల వేద మంత్రోచ్ఛారణల మధ్య, ముత్యాల తలంబ్రాలతో గోదాదేవి, రంగనాథస్వామి వారి కళ్యాణోత్సవం ద్రవిడ సంప్రదాయంలో కనుల పండువగా జరిగింది. అర్చకులచే నిర్వహించిన దేవతామూర్తుల మాల మార్పిడి ఆకట్టుకున్నది.
అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో కాంటేకార్ రాఘవేందర్జీ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, పీఏసీ ఎస్ డైరెక్టర్ వెంకటేశ్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, హన్మానాయక్, నర్సింహ, శాయిరెడ్డి, రాములుగుప్తా, విష్ణువర్ధన్, జంగారెడ్డి, వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, డాక్టర్ రమేశ్, రాఘవేందర్, సురేందర్‌రెడ్డి, రమేశ్, పెంటారెడ్డి, రాములు, యాదయ్యగౌడ్, అశోక్, చంద్రశేఖర్, సత్యం, మల్లేశ్‌గౌడ్, శ్రీను, మహేశ్, ప్రభులింగం, రామచందర్‌నాయక్, పాండు, రాజేశ్, భానుకిరణ్, భగీరథ్, చందు, వంశీ, అర్చకులు రఘురాం, వేణుగోపాల్, వెంకటేశ్, శ్రీధర్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

