Kadthal : ఘనంగా రంగానాథస్వామి కల్యాణం..

కడ్తాల్ : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో, ధనుర్మాసాన్ని పురస్కరించుకోని గోదాదేవిరంగానాథస్వామి వారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయ ముద్రకర్త, ముతవల్లి టీవీ రామానుజాచార్యుల ఆధ్యర్యంలో శుక్రవారం ఉదయం శ్రీవారికి అభిషేకం, అర్చన, హారతీ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని తోరాణాలు, వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. గోదాదేవిరంగానాథస్వామి వారి విగ్రహాలను పూలమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తులు కరతాళధ్వానుల మధ్య, గోదారంగనాథస్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని, తీర్థప్రసాదాలను భక్తులకు స్వీకరించారు. అనంతరం దేవతమూర్తులను పల్లకిలో ఆలయ పరిసరాలలో ఊరేగించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింహా, నాయకులు సాయిలు, చంద్రమౌళి, జనీల్, బాల్రాజ్, చెన్నయ్య, మహేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రసాద్, చంద్రశేఖర్, ఆలయ అర్చకులు వేణుగోపాలచార్యులు, టీవీ చక్రవర్తి, టీవీ ఆదిత్య, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

