కడ్తాల్ : మండల కేంద్రంలో మతసామరస్యం వెల్లివెరిసింది. ఆదివారం రాత్రి కడ్తాల్ పట్టణానికి చెందిన మైనార్టీ నాయకుడు మహ్మద్‌గౌస్ అయ్యప్ప మాలధారులకు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కులమతాలు వేరైనా సమాజంలో అందరూ సమానమేనని, ఇలాంటి కార్యక్రమాలు దేశ ఐక్యతను చాటుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం అయ్యప్పస్వాములకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్న మహ్మద్‌గౌస్‌ను పలువులు అభినందించారు. కార్యక్రమంలో స్వాములు భీముడు, బిక్కునాయక్, జగత్‌రెడ్డి, విజయ్‌గౌడ్, లక్ష్మణ్, రమేశ్‌చారి, మహేందర్‌రెడ్డి, హరీశ్‌గౌడ్, సైదులు, శివగౌడ్, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.