ఫార్మా రైతులకు న్యాయం చేయాలి
ఫార్మా రైతులకు న్యాయం చేయాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకురాలు కవుల సరస్వతి, గణేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి భూ ములివ్వని రైతుల పేర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి టీజీఐఐసీ స్థానంలో రైతుల పేర్లను ఎంట్రీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- భూములివ్వని రైతుల పేర్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి
- ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకురాలు కవుల సరస్వతి
యాచారం, జూలై 28 : ఫార్మా రైతులకు న్యాయం చేయాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకురాలు కవుల సరస్వతి, గణేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి భూ ములివ్వని రైతుల పేర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి టీజీఐఐసీ స్థానంలో రైతుల పేర్లను ఎంట్రీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మంగలిగడ్డతండా, మర్లకుంటతండాలకు చెందిన రైతులు ఫార్మా కు ఇవ్వని 2,250 ఎకరాల భూమిని భూసేకరణ నుంచి మినహాయించి.. ఆ భూములను అమ్ముకునేందుకు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమివ్వాలన్నారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కో ల్పోయిన రైతులు, వ్యవసాయ కూలీలకు సరైన నష్టపరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీల సమస్యలు పరిష్కరించేవరకు ఆ భూముల ను స్వాధీనం చేసుకోవద్దన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు ఇచ్చే వరకు రైతుల భూముల్లో అడుగు పెట్టొద్దని హెచ్చరించారు. రైతుల పొలాల్లో అక్రమంగా బుల్డోజర్లు, హిటాచీలు, టిప్పర్లతో చేపట్టిన పనులను వెం టనే నిలిపివేయాలన్నారు. కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని మర్లకుంటతండా, మంగలిగడ్డతండాల్లో గిరిజన భూముల్లో వారి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును వెంటనే నిలిపివేయాలని.. నాలుగు గ్రామాల్లోని రైతులను బెదిరిస్తున్న రెవెన్యూ, పోలీసులపై ఉన్నతాధికారులు తగి న చర్యలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని పూర్తిగా రద్దు చేస్తూ జీవోను విడుదల చేయాలన్నారు. ఫార్మాసిటీకి బదులుగా ఇప్పటికే సేకరించిన భూముల్లో ఎలాంటి కంపెనీలు పెడతారో వాటి పూర్తి వివరాలు, ప్రాజె క్టు రిపోర్టులను తెలుగులో అధికారికంగా ప్రజలకు ముందుగానే వివరించాలని కోరారు. వాటిపై ప్రతి గ్రామంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే ప్రజల సమ్మతి మేరకే ఆ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఫార్మా బాధిత రైతులతో కలిసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు నిరంజ న్, నారాయణ. సందీప్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, అనసూయమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

