షాబాద్, ఫిబ్రవరి 11: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామంలో శివా లయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11గంటలకు స్వామివారి ఎదుర్కోళ్లు అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. ఆది దంపతుల కల్యాణం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణం అనం తరం మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోశారు.
శుభ సమయంలో ఒక్కటైన ఆది దంపతులకు భక్తులు తాము కుటుంబం సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో ఆయు రారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, నాయకులు నర్సింహులు, జగదీశ్వర్, శ్రీరాంరెడ్డి, రాంమోహన్, ప్రదీప్, శశాంక్‌రెడ్డి, హరీశ్, రఘు, అశోక్ పాల్గొన్నారు.
కేశంపేట : కేశంపేటలో దవళగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భక్తులు రథోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. దేవాలయం నుంచి రథంపై భక్తులు వేంకటేశ్వరస్వామి, మంగాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రథాన్ని దేవాలయానికి తీసుకెళ్లి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శకటోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.