వికారాబాద్, ఫిబ్రవరి 29 : ఇంటర్ రెండో ఏడాది వార్షిక పరీక్షలు వికారాబాద్ జిల్లాలో తొలిరోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 29 పరీ క్షా కేంద్రాల్లో 7,849 మంది విద్యార్థులకుగాను 7,697 మంది స్టూడెంట్స్ హాజరు కాగా 152 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు కొం దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు.
కేంద్రాల వద్ద పోలీ స్ బందోబస్తు నిర్వహించారు. జనరల్‌లో 6,602 మం ది ఉండగా 6,489 మంది విద్యార్థులు హాజరు కాగా 113 మంది గైర్హాజరయ్యారు. ఒకేషన్లో 1,247 మందికిగానూ 1,208 మంది విద్యార్థులు పరీక్షను రాశారు. ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతోపాటు కేంద్రాల చుట్టు పక్కల ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేశారు.
షాబాద్, ఫిబ్రవరి 29: రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ద్వితీయ ఏడాది తొలి పరీక్ష సజావుగా జరిగింది. గురువారం జిల్లా వ్యాప్తంగా తెలుగు పరీక్షకు 69,171 మంది విద్యార్థులకు గాను 68,190 మంది హాజరు కాగా 981 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 195 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీసీటీవీల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా జిల్లాలో నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిమిషం నిబంధన ఉన్న నేపథ్యంలో విద్యార్థులందరూ కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు.