షాద్‌నగర్, జనవరి 5 : భారీ పరిశ్రమల ఏర్పాటుతో షాద్‌నగర్ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా అవతరిస్తున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధిని చూపుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదు. దీంతో చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు కొత్తూరు మండల కేంద్రాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తిం చి.. పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు కాలానుగుణంగా షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండలాలతోపాటు స్థానికంగా భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు వెలిశాయి. నేడు కొత్తూరు, షాద్‌నగర్ పారిశ్రామికవాడల్లో సుమారు 200పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి.
వీటికి దీటుగా కొందుర్గు, కేశంపేట, నందిగామ మండలాల్లోనూ పారిశ్రామిక రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. ఈ పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొం దిన ఫార్మా, వస్ర్తాలు, కాస్మెటిక్స్, ముడిఇనుము, చమురు, లేదర్, ఫైబర్, తినుబండారాల తయారీ వంటి పరిశ్రమలు న్నాయి. కానీ ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో జిల్లాలో పారిశ్రామిక రంగం కుంటుపడిపోయింది. ప్రత్యేక తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటయ్యే వరకు షాద్‌నగర్ ప్రాంతంలో ఐదు శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. స్థానికులు ఉపాధి కోసం గగ్గోలు పెట్టారు.
అయినా ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పట్టించుకోలేదు. కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఉపాధి అవకాశా లు మెరుగై.. ప్రగతి పరుగులు పెడుతున్నది. టీఎస్ఐపాస్ ప్రారంభం తర్వాత ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతంలో తమ బ్రాంచీలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. గతం కంటే నేడు అదనంగా సుమారు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని కార్మిక సంఘాల నేతలు, కార్మికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
భారీ పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల కల్పనకు కేరాఫ్ అడ్రస్‌గా షాద్‌నగర్ ప్రాంతం మారింది. వలసలను నివారించడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ సంస్థల ఏర్పాటుకు అనుకూలం కావడంతో ఏటేటా భారీ, మధ్య, చిన్న తర హా పరిశ్రమలు వెలుస్తున్నాయి. గడిచిన ఏడేండ్ల కాలంలో పీఅండ్‌జీ అనే అంతర్జాతీయ కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ, ఎంఎస్ఎన్ ఫార్మా, అమెజాన్ సంస్థ, ఫోకర్ణ క్వార్జ్ టైయిల్స్ వంటి భారీ పరిశ్రమలు, విజయ పాలిమార్స్, టోటల్ ఆయి ల్ వంటి పరిశ్రమలు పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.
టీఎస్ ఐపాస్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తర్వాత.. కొత్తూరు పారిశ్రామికవాడ, నందిగామ, ఫారుఖ్‌నగర్ మండలంలోని చింతగూడ, బూ ర్గుల, ఎలికట్ట, మొగిలిగిద్ద, ఫారూఖ్‌నగర్, చిల్కమర్రి, రాయి కల్, రామేశ్వరం, అన్నారం గ్రామాల్లో.. అదేవిధంగా నందిగామ మండలంలోని మేకగూడ, సంఘీగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ, రంగాపూర్, చేగూరు గ్రామాల్లో.. కొత్తూరు మండల కేంద్రంతోపాటు తిమ్మాపూర్, ఫాతిమాపూర్, ఇన్మూల్‌నర్వ, సిద్ధ్దాపూర్, పెంజర్ల గ్రామాలతోపాటు అదేవిధంగా కొందుర్గు మం డల కేంద్రంతోపాటు శ్రీరంగాపూర్, రామచంద్రాపూర్ గ్రా మాల్లో.. చౌదరిగూడ మండల కేంద్రంతోపాటు లాల్‌పహాడ్ గ్రామాల్లో పలు మధ్య, చిన్న తరహా పరిశ్రమలు వెలిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కంసాన్పల్లి గ్రామంలో త్వరలోనే మేలుజాతి పశు వీర్యోత్పత్తి కేంద్రం అందుబాటులోకి రానున్నది. ఇలా పరిశ్రమలకు నెలవుగా మారడంతోపాటు ఈ ప్రాంతం ఉపాధి కల్పన కేంద్రం గా పేరొందింది. వేల మందికి ఉపాధిని చూపుతుతున్నది.
షాద్‌నగర్ ప్రాంతం పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ వందకుపైగా భారీ, మధ్య, చిన్న తర హా పరిశ్రమలున్నాయి. కాస్మెటిక్స్, బ్యాటరీలు, ఫార్మా, ఇస్పత్ ఇనుము, ముడి ఇనుము, వంట నూనెలు, చాక్లెట్, బిస్కెట్, టెక్స్టైల్, రసాయనాల ఉత్పత్తి, వ్యవసాయ రంగ పరిశ్రమలు వంటివి వెలిశాయి. నిత్యం వేలాది మంది కార్మికులు ఉపాధిని పొందుతున్నారు. స్థానిక కార్మికులతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు.. అదేవిధంగా దేశంలోని కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన వారూ ఇక్కడ జీవనోపాధిని పొందుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 180 పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లో కలిపి 60 వేల మంది నిత్యం ఉపాధి పొందుతున్నారు. గతంలో 20 నుంచి 25 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండేవారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అదనంగా 25 నుంచి 30 వేలకు పైగా కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరికి తోడుగా వందల సంఖ్యలో రోజువారీ కూలీలుగా ఉపాధిని పొందుతున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు విరివిగా ఏర్పాటవుతున్నాయి. షాద్‌నగర్ ప్రాంతంలో వందలాదిగా ఏర్పాటైన పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది. నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పని దొరుకుతున్నది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. రాను న్న రోజుల్లో మరింత మందికి ఉపాధి లభించనున్నది. ఉపాధి కల్పన శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన వారు స్వేచ్ఛంగా జీవిస్తున్నారు.
– అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే షాద్‌నగర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఎప్పుడూ కంపెనీల నుంచి తొలగిస్తారో అనే భయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తున్నది. గతంతో పోల్చుకుంటే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్థానికులు, రాష్ర్టానికి చెందిన వారితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ పని చేసుకుని జీవిస్తున్నారు.
– వల్కె రమేశ్, కార్మికుడు, జంగోనిగూడ
నేను నాలుగేండ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఓ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తూ జీవిస్తున్నా. మా ప్రాం తంలో ఉపాధి అవకాశాలు అంతగా లేవు. దీంతో యు వకులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నాతోపాటు మా రాష్ర్టానికి చెందిన వారు వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో పనిలేదనే బాధే లేదు.
– శివాజీ, కార్మికుడు, బీహార్ రాష్ట్రం
గతంలో స్థానికులకు కూడా ఇక్కడ ఉపాధి దొరికేదికాదు. దీంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వేలాది మంది ఉపాధిని పొందుతున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఇక్కడ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
– బుయ్యని నవీన్‌కుమార్, కార్మికుడు, కేడీఎల్ పరిశ్రమ, నందిగామ