రాయితీలు రాలు.. ప్రోత్సాహం లేక..
జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి న 30 నెలల్లో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. అధికారంలోకి రాక ముం దు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి.. గద్దెనెక్కగానే హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.
- 30 నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాని వైనం
- ఇండస్ట్రీల కోసం పెద్ద ఎత్తున భూములను సేకరించిన రేవంత్ సర్కార్
- ఉద్యోగాలు లేక ఇబ్బందుల్లో నిరుద్యోగులు
- గత కేసీఆర్ హయాంలో భారీగా పరిశ్రమల ఏర్పాటు
- బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఫాక్స్‌కాన్ కంపెనీయే జిల్లాకు తలమానికం
- కాంగ్రెస్ హయాంలో కుంటుపడిన పారిశ్రామిక ప్రగతి
రంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి న 30 నెలల్లో జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. అధికారంలోకి రాక ముం దు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి.. గద్దెనెక్కగానే హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫ్యూచర్‌సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామ ని హామీ ఇచ్చిన సర్కార్ రెండేండ్లు దాటినా దాని ఊసే ఎత్తడంలేదు.
ఆ యూనివర్సిటీ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. పరిశ్రమల ఏర్పాటు కోసమని వేలాది ఎకరాలను సేకరిస్తున్నా చెప్పుదగ్గ ఇండస్ట్రీల ఏర్పాటే జరగడంలేదు. గతంలో శంషాబాద్, రాజేంద్రనగర్, ఫారుక్‌నగర్, షాద్‌నగర్ వంటి ప్రాం తాల్లో పరిశ్రమలు ఏర్పాటుకాగా.. వాటికి రాయితీలు ఇవ్వకపోవటంతో అవి మూతపడే స్థితికి చేరుకున్నాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ముందుకొస్తున్నా ప్రభుత్వపరంగా సరైన ప్రోత్సాహం లేదన్న ఆరోపణలున్నాయి.
ఉపాధి చూపని పరిశ్రమలు..
జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది మెగా ఇండస్ట్రియల్స్, 62 మధ్యతరహా పరిశ్రమలు, 2,182 చిన్న తరహా పరిశ్రమలున్నాయి. వాటికి ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహం లభించకపోవడం తో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడంలేదు. ఉన్న ఉద్యోగులనే యాజమాన్యాలు తొలగిస్తున్నాయి.. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉన్న వాటిలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో 20వేల మందికిపైగా పలు రంగాల్లో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులు న్నా వారికి ఉద్యోగావకాశాలు లభించని దుస్థితి నెలకొన్నది.
నత్తనడకన స్కిల్ యూనివర్సిటీ పనులు..
జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉదేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీర్ఖాన్పేట వద్ద స్కిల్ యూనివర్సిటీ కోసం శంకుస్థాపన చేసింది. రెండేండ్లు దాటినా ఈ వర్సిటీ భవన నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యా యి. పనులు నత్తనడకన సాగుతుండడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పారిశ్రామిక ప్రగతి పేరుతో వేలాది ఎకరాల భూసేకరణ..
ఫ్యూచర్‌సిటీ, పరిశ్రమల ఏర్పాటు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో వేలాది ఎకరాలను సేకరిస్తున్నది. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, కొత్తపల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, బేగరికంచ, మీర్ఖాన్పేట, తిమ్మాయపల్లి, ముచ్చర్ల, మహేశ్వరం మండలంలోని రావిర్యాల, తుక్కుగూడ, నాగారం వంటి గ్రా మాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టింది. భూసేకరణ జరిపిన భూముల్లో ఇప్పటికీ ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేసిన దాఖలాల్లేదు.
జిల్లాకే తలమానికం ఫాక్స్‌కాన్, కెయిమ్స్
గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పలు ఐటీ రంగ సంస్థలతోపాటు ఫాక్స్‌కాన్, కెయిమ్స్ వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇండస్ట్రీల ఏర్పాటుకు గత ప్రభుత్వం భూములు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించడంతో అవి నిర్ణీత గడువుకంటే ముందే ఏర్పాటే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నాయి. అలాగే, తుక్కుగూడ, రావిర్యాల, ఆదిబట్ల వంటి ప్రాంతాల్లో కాగ్నిజెంట్, ఫ్యాబ్సిటీతోపాటు ఐటీ రంగ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటై నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
నిరుద్యోగులను మోసం చేసింది..
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ 30 నెలలు దాటినా ఒక్క ఉద్యోగాన్ని కల్పించలేదు. పరిశ్రమల పేరుతో భూములను రైతుల నుంచి బలవంతంగా గుంజుకుంటూ వారిని రోడ్డున పడేస్తున్నది. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రెండున్నరేండ్లు గడిచినా నిరుద్యోగుల కల మాత్రం నెరవేరడంలేదు.
-నిట్టు జగదీశ్వర్, బీఆర్ఎస్వీ నాయకుడు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

