Indira Mahila Shakti Canteen | క్యాంటీన్ మూన్నాళ్ల ముచ్చటేనా.. నెల కాకముందే మూతపడిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (Indira Mahila Shakti Canteen) మూన్నాళ్ల ముచ్చట గానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు.
బడంగ్ పేట్, జూలై 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (Indira Mahila Shakti Canteen) మూన్నాళ్ల ముచ్చట గానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా తెలంగాణ) ఆధ్వర్యంలో మున్సిపాల్ నిధులతో ఏర్పాటు చేశారు. పాత గోడకు కొత్త సున్నం అన్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్రీట్ విండర్ కోసం ఏర్పాటుచేసిన కంటైనర్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సిద్ధం చేశారు. దానికి కూడా లక్షలలో నిధులు వెచ్చించారు. అయితే లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నెల రోజులు కాకుండానే మూతపడింది.
మెప్మా మహిళలు నిర్వహించిన క్యాంటీన్‌కి ఆదరణ కరువై ఆదిలోనే హంసపాదు పడ్డట్లు అయింది. ప్రధాన రహదారిపై క్యాంటీన్ ఉన్నప్పటికీ కస్టమర్లు ఎవరూ రాక నిర్వాహకులు నష్టపోయినట్టు తెలిసింది. నెలరోజులు కూడ క్యాంటీన్ సక్రమంగా నడవలేదని స్థానికంగా చర్చజరుగుతున్నది.

ముందే చెప్పిన మహిళా సంఘాలు
ఆ ప్రాంతంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడవదని మెప్మా బంగాళ మహిళలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి మాటలను పట్టించుకోకుండానే ఏర్పాటు చేశారు. తాము చెప్పింది వినకపోవడంతోటే ఈ పరిణామం చోటు చేస్తుందని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
క్యాంటీన్లు సరిగ్గా నడవడం లేదని..
ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ సరిగ్గా నడవడం లేదని పక్కన ఉన్న వీధి వ్యాపారులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గత పదేండ్లుగా చిరు వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాలను రోడ్డున పడేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పునరుద్ధరించడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు బాగా నడుస్తున్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు క్యాంటీన్ బంద్ కావడం గందరగోళంలో పడ్డారు. క్యాంటిన్‌ను తిరిగి తెరిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
లక్షల రూపాయలు వృథా..
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు లక్షలు విచ్చించారు. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. క్యాంటీన్‌ను పునరుద్ధరించాలని చెప్పినప్పటికీ అందుకు మెప్మా మహిళలు సుముఖంగా లేరని తెలుస్తుంది. క్యాంటీన్ గురించి వివరాలను కోరగా కమిషనర్ సరస్వతి స్పందించలేదు. మెప్మా అధికారి శంకర్ మాత్రం మార్చిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఏదో కారణం చేత క్యాంటీన్ సరిగా నడవడం లేదన్నారు. ఒక నెల మాత్రమే నడిపించారని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

