ఉమ్మడి జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేసిన అధికారులు గురువారం ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31,08,851కి చేరింది. ఇందులో పురుష ఓటర్లు 16,16,455 మంది, మహిళా ఓటర్లు 14,91,245 మంది ఉన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 8,81,028 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 4,41,688 మంది, మహిళలు 4,38,752 మంది ఉన్నారు. అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,34,652 ఓటర్లున్నారు. జిల్లాలో కొత్తగా 9282 మంది ఓటరు జాబితాలో చేరారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 4,437 పోలింగ్ కేంద్రాలున్నాయి.
వికారాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో 9,282 మంది కొత్త ఓటర్లుగా చేరారు. కాగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లలో అత్యధికంగా వికారాబాద్ నియోజకవర్గంలో 3,494మంది ఓటర్లు, పరిగి నియోజకవర్గంలో 3,489మంది, కొడంగల్లో 2,2 51 మంది, అత్యల్పంగా తాండూరు నియోజకవర్గంలో 48మంది ఓటర్లు పెరిగారు. నాలుగు నియోజకవర్గాల్లో 1,130 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 8,71,746 మంది ఓటర్లుండగా, తుది జాబితా ప్రకారం8,81,028 మందికి పెరిగారు.
తుది జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,81,028 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,41,688 మంది కాగా..మహిళలు-4,38,752 మంది, ఇతరు లు-26మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు-21 మంది, సర్వీసు ఓటర్లు-541 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,34, 652 మంది ఓటర్లుండగా.. అందులో పురుషు లు-1,19,512 మంది, మహిళలు-1,14,8 65 మంది, ఇతరులు-8మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు-ఏడుగురు, సర్వీసు ఓటర్లు-260 మంది ఉన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొ త్తం ఓటర్లు 2,14,523 మంది ఉండగా వారిలో పురుషులు-1,08,589 మంది, మహిళలు-1,05,855 మంది, ఇతరులు-ముగ్గురు, ఎన్ఆర్ఐ ఓటర్లు-ఏడుగురు, సర్వీసు ఓటర్లు-69 మంది ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,897 మంది ఉండగా వారిలో పురుషులు-1,05,960 మంది, మహిళలు-1,09,875 మంది, ఇతరులు-ఎనిమిది మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు- ఆరుగురు, సర్వీసు ఓటర్లు-48 మంది ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్లు 2,15,956 మంది ఉండగా వారిలో పురుషులు-1,07,627 మంది, మహిళలు-1,08,157 మంది, ఇతరులు-ఏడుగురు, ఎన్ఆర్ఐ ఓటర్లు-ఒకరు, సర్వీసు ఓటర్లు-164 మంది ఓటర్లున్నారు.
రంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ): జిల్లాలో మొత్తం ఓటర్లు 31,08,851 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా తుది ఓటర్ల జాబితాను గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31,08,851 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. అందులో పురుషులు 16,16,455 మంది కాగా మహిళా ఓటర్లు 14,91,245 మంది, థర్డ్జెండర్స్ 368 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లలో 144 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉండగా.. సేవలందించే ఓటర్లుగా 582 మంది పురుషులు, 19 మంది మహిళలున్నారు. ఎనిమిది నియోజవర్గాలకు గాను 3,307 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.