ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28 : వివిధ రంగాల్లో యువత సైన్స్‌ను ఉపయోగించి నూతన ఒరవడిని సృష్టించాలని బీడీఎల్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ సైన్స్ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. అనంతరం గురునాన క్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కోహ్లీ మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో ఉన్న సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ఎండీ సైనీ, ప్రిన్సిపాల్ శ్రీనాథ్‌రెడ్డి, హెచ్వోడీలు శ్రీనివాస్, విజయలక్ష్మి, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని పెద్దఅంబర్‌పేట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రాంచంద్రారెడ్డి అన్నారు. పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వైజ్ఞానిక ప్రదర్శనలు రూపొందించారు. ఒక్క సైన్స్ ఆవిష్కరణ ప్రపంచాన్నే మార్చుతుందని ఉపాధ్యాయులు సూచించారు.
ఘనంగా జాతీయ సైన్స్ డే
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండంలోని వివిధ గ్రా మాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ సి.వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విఠ్యాల జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, బుడ్యానాయక్, మల్లయ్య, రవికాంత్, మల్లేశ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నమూనాలు..
తుర్కయంజాల్, ఫిబ్రవరి 28 :సైన్స్ అనేది ప్రపంచాన్ని శాసిస్తున్నదని, దైనందిన జీవితాల్లో సైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నదని వక్తలు అన్నారు. మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కొహెడ ప్రభుత్వ పాఠశాల, తుర్కయాంజాల్ ప్రభుత్వ పాఠశాల, సంకీర్త్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. సైన్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. తుర్కుయాంజాల్లో కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కొహెడ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం దన్నె రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేశంపేట ప్రభుత్వపాఠశాలలో..
కేశంపేట : కేశంపేట ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అగ్నిపర్వతాలు, మూత్రపిండాల పనితీరు, గుండె పనిచేయు విధానం, ట్రాఫిక్ సిగ్నల్స్, గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ తదతర అంశాలపై ప్ర దర్శనలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బహుమతులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం రసూల్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నజియాబేగం, వైస్ చైర్మన్ జగన్, ఉపాధ్యాయులు ఆనంద్‌కుమార్, వీరారెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
షాద్‌నగర్‌టౌన్ : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని భాగ్యనగర్‌కాలనీ వివిధ రంగాల్లో యువత సైన్స్‌ను ఉపయోగించి నూతన ఒరవడిని సృష్టించాలని బీడీఎల్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ సైన్స్ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను హెచ్ఎం రఫత్సుల్తానాతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు యుగేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి అన్నారు. విద్యార్థులు 44 నమూనాలను ప్రదర్శించారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులచే పలు ప్ర యోగాలు చేయించారు. విద్యార్థులు సీవీ రామన్, అబ్దుల్ కలాం వేషధారణలో ఆకట్టుకున్నారు. క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ ఎం పద్మ, ఉపాధ్యాయులు ప్రేమకుమారి, సుగుణ, భాగ్యలక్ష్మి, అరుణ, విజయలక్ష్మి, దుర్గ, శ్వేత, జయశ్రీ, అరుణ, సురేఖ, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన ప్రదర్శన మేళా
యాచారం : మండలంలోని నందివనపర్తి ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన మేళాను నిర్వహించారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనతా ప్రిజ్, బ్లడ్ గ్రూప్‌ను గుర్తించడం, మానవ శరీర భాగాలు, పర్యావరణ సమతుల్యత, గుండె పనితీరు వంటి ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకట్‌రెడ్డి, సుధారాణి, అరుణ, విజయరాణి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్‌ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల ప్రదర్శనలను పలువురు పరిశీలించారు. ఉత్తమ ప్రతి భ కనబర్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఎలిమినేడు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, హెచ్ఎం ఝాన్సీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అవంతి కళాశాలలో..
అబ్దుల్లాపూర్‌మెట్ : గుంతపల్లిలో గల అవంతి కళాశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల హెచ్ఆర్ డైరెక్టర్ వై జయప్రద, ప్రిన్సిపాల్స్ రామచంద్రారెడ్డి, శివకుమార్, నాగరాజు , విద్యార్థులు పాల్గొన్నారు.
9++9