వికారాబాద్, జూన్ 15 : వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐదోస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ప్రశంసించారు. శనివారం జిల్లాలోని చెన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సం దర్శించగా.. డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఫార్మసీ స్టోర్, ల్యాబ్, ప్రసూతి, ఇన్ పేషెంట్ వార్డులను పరి శీలించి..వైద్యాధికారులు, సిబ్బందికి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదోస్థానంలో ఉన్నందుకు ప్రశంసిస్తూ ఇంకా సమర్థవంతంగా పని చేసి మొదటిస్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో ప్రో గ్రాం అధికారులు డాక్టర్లు రవీంద్రయాదవ్, జీవరాజ్, సాయిబాబా, రతన్‌లాల్, బుచ్చిబాబు, నిరోష పాల్గొన్నారు.