ఇబ్రహీంపట్నం, మార్చి 11 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గతకొన్ని రోజులుగా అవిశ్వాస పరంపర కొనసాగుతున్నది. మొన్నటి వరకు చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కౌన్సిలర్లు నెల రోజులపాటు క్యాంపులకు వెళ్లారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టించడంలో వైస్ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించారు.
దీంతో ఆమెపై కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన పలువురు కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు. తీర్మాన పత్రంపై సంతకాలు చేసిన వారిలో కౌన్సిలర్లు నీళ్ల భానుబాబుగౌడ్, బర్తాకి జగన్నాథం, యాచారం సుజాత, మంద సుధాకర్, సుల్తాన్, పంది శంకరయ్య, ఆకుల మమత, ఈర్లపల్లి సునీత, నరాల విశాల, ఇందిరాల రమేశ్, సుల్తానాబేగం, బర్ల మంగ, కప్పరి స్రవంతి, నీలం శ్వేత, జెర్కోని బాలరాజులు ఉన్నారు. మళ్లీ కౌన్సిలర్లంతా క్యాంపులకు వెళ్లే అవకాశం ఉన్నది.