కులమతాలకతీతంగా అందరూ జరుపుకొనే పండుగ హోలీ. వేడుకల కోసం నగర శివారుల్లోలని పలు రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతా కలిసి ఒకే చోట హోలీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఖర్చు ఎక్కువయినా వెనుకాడటంలేదు. రెయిన్ డ్యాన్సులు, డీజేలు తప్పనిసరిగా చేసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ పండుగపూట రసాయన రంగులు వాడి రోగాలు కొనితెచ్చుకోకుండా సహజసిద్ధంగా లభించే మందులను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రంగులు చల్లుకునే సమయంలో కండ్లు, ముక్కు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
– ఇబ్రహీంపట్నం/పెద్దఅంబర్‌పేట, మార్చి 13
పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంద, వేపాకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధంపొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతో పాటు సువాసన వెదజల్లుతుంది.
రసాయన రంగులతో చర్మ వ్యాధులు
వసంతకాలం వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో సహజసిద్ధమైన రంగులు శరీరానికి ఔషధంలా పనిచేస్తాయి. పూర్వం నిమ్మ, కుంకుమపువ్వు, పసుపు, బిల్వాలతో సహజ రంగులను తయారుచేసి హోలీ ఆడేవారు. కాలక్రమేణా రసాయనాలతో తయారుచేసిన రంగుల వాడకం పెరిగి సహజ రంగుల వాడకం తగ్గింది. రసాయన రంగులతో ఈ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో.. అంతే విషాదాన్ని మిగుల్చుతుంది.
రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళ్లమంటలు, ఆస్తమా, చర్మ వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ ఉంటుందని, ఇది మూత్రపిండాలను పాడు చేస్తుందని, వెండి రంగులో ఉండే మెర్క్యూరీ సల్ఫేట్‌తో క్యాన్సర్ సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాపర్ సల్ఫేట్ ద్వారా ఎలర్జీతో పాటు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉంది. పొడిగా ఉండే రంగుల్లో జిలెటిన్పైలట్ కలవడం వల్ల మైకంతో పాటు ఆస్తమా, అంధత్వం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అందువల్ల హోలీ పండుగలో రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడటం ఎంతో శ్రేయస్కరం.
సహజ రంగుల తయారీ విధానం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు