ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనిక పట్టణాభివృద్ధి సంస్థగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు కామధేనువులా నిలిచిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిష్ట దిగజారిపోయింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చేతిలో చివ్వ గవ్వ లేక వేల కోట్ల ప్రాజెక్టుల భవితను ఆగమ్యగోచరంగా మార్చివేసింది. ముఖ్యంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం అవుతుండటం, దేశీయ బ్యాంకింగ్ సంస్థలు ముఖం చాటేయడాన్ని గమనించిన హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్… యంత్రాంగాన్ని విదేశీ బాట పట్టించారు. ఖండాంతరాలు దాటి నిధుల కోసం కసరత్తు చేస్తున్నారు.
-సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ)
30 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేపట్టిన విధానాలతో మున్సిపల్ శాఖపై ప్రభు త్వం పట్టు కోల్పోయింది. ఈ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకు న్నా.. చేపట్టిన ప్రాజెక్టులను పట్టాలెక్కించలేని దయనీయ పరిస్థితి. హెచ్ఎండీఏ పరిధిలో స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు అతిగతీలేకుండా కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దీనికి ప్ర ధాన కారణం నిధుల కొరతే. గతంలో రియల్ ఎస్టేట్ రంగం మెరుగ్గా ఉన్న సమయంలో గత ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టునూ శరవేగం గా పూర్తి చేసింది. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధుల్లేక కాలయాపన చేయాల్సిందే.
ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని, గ్యారెంటీలు, ఆదాయ వనరులపై పూర్తి అవగాహన ఉండటంతో దేశీయ బ్యాంకులన్నీ నిధులు సమకూర్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. హైడ్రా పేరిట నగరంలో జరిగిన విధ్వంసం దాని పర్యవసానాలు రియల్ ఎస్టే ట్, బ్యాంకింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఇలాంటి సంస్థలకు నిధులు మంజూరు చేసే పరిస్థితి లేకుండా పో యింది. ఇదే హెచ్ఎండీఏ అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నది. దీంతో దేశీయ బ్యాంకులన్నీ చేతులు ఎత్తివేయడం, ఆర్బీఐ పెడుతున్న కొర్రీలు కూడా అప్పు పుట్టడం లేదనే తెలుస్తున్నది. ఈక్రమంలోవిదేశీ రుణా ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తు న్న సర్కారు..తక్కువ వడ్డీ పేరిట ఖండాంతరాలు దాటి నిధుల కోసం పర్యటించాల్సి వస్తున్నది.
హెచ్ఎండీఏ ప్రతిపాదించిన దాదాపు రూ.25 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడంతో కాగితాల్లో మూలుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్లు, అవుటర్ రింగు రోడ్డు నుంచి ట్రిపులార్ను అనుసంధానం చేస్తూ చేపట్టే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసీ వంటి ప్రాజెక్టులు ఇలా వేలాది కోట్లు విలువ చేసే ప్రతిపాదనలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నింటికి టెండర్ల ప్రక్రియ ముగిసినా నిధుల కొరతతో పురోగతి లేదు. సర్కారు చేతిలో వేల కోట్ల ప్రాజెక్టులుండగా.. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ప్రతిపాదనలతోనే సర్కారు ఊరిస్తున్నది.
దేశీయ బ్యాంకుల నుంచి వచ్చిన విముఖతతో ఇప్పుడు కమిషనర్ సర్ఫరాజ్ మార్గదర్శనంలో చైనాలో పర్యటిస్తున్న హెచ్ఎండీఏ బృందం.. ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతు న్నది. గతంలో చైనా బ్యాంకుల నుంచి రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు కేంద్రం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో చైనాలో పర్యటిస్తున్న హెచ్ఎండీఏ బృందానికి అక్కడ నిధులు ఇచ్చేందుకు మొగ్గుచూపినా.. కేంద్రం నుంచి వచ్చే అనుమతులు అత్యంత కీలకమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.