హెచ్ఎండీఏ దూకుడు..
‘రియల్' రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్‌తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా చక్కని మౌలిక వసతులు ఉన్న ప్లాట్లను అమ్మకానికి పెట్టింది.
- రంగారెడ్డి జిల్లాలో 8 చోట్ల ప్లాట్ల అమ్మకానికి వేలం
- ప్రజల విశేష ఆదరణతో ప్లాట్ల అమ్మకానికి ముందడుగు
- ఎలాంటి చిక్కుల్లేకుండా క్లియర్ టైటిల్
- ఈ నెల 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, 18న యాక్షన్
- ‘రియల్’ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న హెచ్ఎండీఏ
‘రియల్’ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్‌తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా చక్కని మౌలిక వసతులు ఉన్న ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, నల్లగండ్లలో రెండుచోట్ల, బుద్వేల్, చందానగర్‌లో స్థలాలను విక్రయించనున్నది. ఈ నెల 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరించనుండగా, 18వ తేదీన వేలం వేసేందుకు హెచ్ఎండీఏ రంగం సిద్ధం చేసింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతిఒక్కరూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్లాట్లను ఈ-వేలంలో అమ్మకానికి పెడుతున్నది. 100 శాతం ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్‌తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా ప్లాట్లు, చక్కని మౌలిక వసతులు ఉండడంతో హెచ్ఎండీఏ ప్లాట్లను దక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు.
ముఖ్యంగా ఈ-వేలం అత్యంత పారదర్శకంగా జరుగుతుండడంతో అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల అమ్మకానికి తాజాగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్‌లో స్థలాలను విక్రయించనున్నారు. మేడ్చల్‌లో బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అమీన్పూర్, రామేశ్వరం బండ, పతిఘన్పూర్, కిష్ణారెడ్డి పేటలో స్థలాలు విక్రయించనున్నారు. కాగా 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరించనుంది. 18వ తేదీన ఈ-వేలం నిర్వహించనుంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

