గొల్లకురుమల ఇంట ఏటా కాసుల పంట పండుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించిన గొర్రెల యూనిట్లు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ.125 కోట్ల వ్యయంతో 11,333 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది. ఒక యూనిట్లో ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఉంటాయి. సబ్సిడీ గొర్రెల సంతానంతో జిల్లాలో గొర్రెల ఉత్పత్తి అధికంగా పెరిగింది. ఇప్పటివరకు ఆరు ఈతలతో మంద పెరుగడంతోపాటు గొర్రెల విక్రయంతో ఏటా ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు.
నాలుగేండ్లలో 4.20లక్షలకుపైగా గొర్రెలను విక్రయించగా.. రూ.252కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించిన ఎంతోమంది గొల్లకురుమలు ప్రస్తుతం సబ్సిడీ గొర్రెలను పెంచుతూ ఆర్థికంగా రాణిస్తున్నారు. మరోవైపు రెండో విడుత గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 10,692 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 317 గొల్లకురుమల సంఘాలుండగా, 22,643 మంది సభ్యులున్నారు.
వికారాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కులవృత్తుల పూర్వవైభవానికి కృషి చేస్తు న్న రాష్ట్ర సర్కార్.. గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో గొల్లకురుమలు ప్రతిఏటా రూ.2లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జి స్తున్నారు. నాలుగేండ్ల కాలంలో సబ్సిడీ గొర్రెలు, వాటి సంతానంతో ఇప్పటివరకు ఆరు ఈతలు రాగా, సబ్సిడీ గొర్రెలతో ఏడాదికి ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. తద్వారా ఈ నాలుగేండ్లలో దాదాపు రూ.250 కోట్లకుపైగా గొల్లకురుమలు రాబడిని పొందారు. కాగా వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 11,333 మంది లబ్ధ్దిదారులకు రూ. 125 కోట్ల విలువ చేసే 2.76 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా నాలుగేండ్లలో వారి ఆదాయం రూ. 250 కోట్లకుపైగా పెరిగినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా మొదటి విడుతలో గొర్రెలను పొందిన లబ్ధిదారులు ఇప్పటివరకు 4.20లక్షల గొర్రెలను రూ.6 వేల చొప్పున విక్రయించి రూ.252 కోట్ల వరకు ఆదాయాన్ని పొందారు. సబ్సిడీపై 21 గొర్రెలను పంపిణీ చేయగా, ప్రతి లబ్ధిదారుడి వ ద్ద 50-80 వరకు గొర్రెల వరకు మంద ఉండ టం గమనార్హం. గొల్లకురుమలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది.
త్వరలో రెండో విడుత ..
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇం దులో భాగంగానే గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. మొదటి విడుత లో సబ్సిడీపై పొందిన గొర్రెలతో చాలామంది గొల్లకురుమల కుటుంబాల్లో వెలుగులు నిండా యి. లబ్ధిదారులు ఇప్పటికే ఆరు పర్యాయాలు గొర్రె పిల్లలతోపాటు ఉన్నితో లబ్ధి పొందారు. అయితే త్వరలోనే రెండోవిడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న ది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. అయితే జిల్లాలో 317 గొల్లకురుమల సంఘాలుండగా 22,643 మంది సభ్యులున్నా రు. వీరిలో మొదటి విడుతలో 11,333మందికి సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయగా, రెండో విడుతలో మిగిలిన 10,692 మందికి అందించనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి యూనిట్ కింద 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును అందించనున్నా రు. ఇందుకోసం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం 75శాతం సబ్సిడీగా ఇవ్వనుండగా, మిగతా 25 శాతాన్ని లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభు త్వం రూ.93,750లను భరిస్తుండగా మిగతా రూ.31,250 లబ్ధిదారులు చెల్లించాలి.
గొల్లకురుమల సంక్షేమానికి పెద్దపీట
సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఇందుకోసం వారికి గొర్రె పిల్లలను పంపిణీ చేసి ఆదుకుంటున్నది. గొర్రెల ను పొందిన లబ్ధిదారులు వాటిని పోషించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. – మల్లేశం, లబ్ధిదారు, జనగాం గ్రామం, పెద్దేముల్ మండలం
గొల్లకురుమలకు జీవనోపాధి దొరిగింది
ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో గొల్లకురుమలకు జీవనోపాధి కలిగింది. అధికారులు నా కు 20 గొర్రెలు, 1 పొట్టేలును పంపిణీ చేశారు. ఈ సందర్భం గా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు – శేఖర్, లబ్ధిదారు, గొట్లపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం