షాద్‌నగర్, జనవరి 25 : వివాహేతర బంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివాహం చేసుకోవాలని తనతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని ఆమె నిలదీయడంతో అత డు ఆగ్రహానికి గురై దారుణంగా చంపిన ఘటన షాద్‌నగర్ పట్టణంలో వెలుగుచూసిం ది. శనివారం షాద్‌నగర్ ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా గొనేగండ్ల మం డలంలోని బండమీది అగ్రహారానికి చెందిన అంద్రి దేవదాస్ అనే వ్యక్తి నందిగామ మండ లం, కన్హాశాంతి వనంలోని కేసీసీ ఇంటర్ కళాశాలలో ప్రైవేట్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా నందిగామ మండలంలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన పిట్టల శివలీల(35)కు భర్త లేకపోవడంతో ఆమె కన్హాశాంతివనంలోనే కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నది.
ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అతడు పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. తనను వివాహం చేసుకోవాలని శివలీల నిలదీస్తుండడంతో దేవదాస్ ఈ నెల 20న షాద్‌నగర్ పట్టణంలోని సంగమేశ్వర లాడ్జికి రామ్మని చెప్పగా.. ఆమె అక్కడికెళ్లింది. ఇరువురి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. శివలీలను ఎలాగైన వదిలించుకోవాలని భావించిన దేవదాస్.. చీరకొంగును ఆమె గొంతును బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొ ని అక్కడి నుంచి పరారయ్యాడు. లాడ్జి సి బ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి బంగారు, వెండి వస్తువులు, సెల్‌ఫోన్, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై కర్నూల్ టౌన్ ఠాణాలో రౌడీషీట్ ఓపెన్ అయిం దని, బైలుప్పల అనే గ్రామానికి చెందిన లక్ష్మిని హత్య చేశాడని వివరించారు.