కొడంగల్, ఏప్రిల్ 2: మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం లభించింది. మౌలిక వసతుల కల్పన లో జిల్లా స్థాయిలో అవార్డును అందుకొని రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. 2022-23వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల కోసం తొమ్మిది అంశాలలో గ్రామాల నుంచి దరఖాస్తులు స్వీకరిం చింది. తొమ్మిది అం శాలలో నిర్దేశించిన ప్రశ్నలు, అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి అధికారులు దరఖాస్తులు పంపారు. జిల్లా స్థాయిలో అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన అధికారులు ఒక్కో అంశంలో మూడు గ్రామ పంచాయతీలను మొదటి, రెండవ, మూడవ స్థానానికి ఎంపిక చేశారు. ఇలా హస్నాబాద్ గ్రామ పంచా యతీ మౌలిక వసతులను కల్పించడంలో అవార్డు కు ఎంపికైంది.
ఇటీవల జిల్లా కేంద్రం లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఫకీరప్ప , పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణిలకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి సన్మానిం చారు. గ్రామంలో మొత్తంగా జనాభా ఎనిమిది వేలు కాగా నాలుగు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ నర్సరీలో ప్రస్తుతం వివిధ రకాలకు సంబంధించి 1500ల వరకు మొక్క లు పెంచుతు న్నారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి గాను 9500ల మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రెండు వేల మొక్కలు నాటి నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలోని నాలుగు పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ఎంపిక కాగా ఇందుకు సంబంధించి రూ.కోటీ 50లక్షలు మంజూరై పనులు జరుగుతున్నాయి. గ్రామంలో ఇప్పటి వరకు రూ.కోటి నిధులతో ప్రతి వీధిలో సీసీ రోడ్లను నిర్మించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు.
ఎంపిక ఇలా
మౌలిక వసతుల కల్పనలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడానికి అధికారులు పలు అంశాలను పరిశీలించారు. క్రీడాప్రాంగణం, క్రిమిటోరియం, డంపింగ్ యార్డు పల్లె ప్రకృతివనం, బ్యాంక్, పోస్టాఫీసు, వెటర్నరీ కార్యాలయం, గ్రంథా ల యం, ప్రైమరీ హెల్త్ సెంటర్, సీసీ రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, హరితహారం తదితర అంశాలను పరిశీ లిం చారు. హస్నాబాద్ గ్రామంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా అధి కా రులు గుర్తించి మౌలిక వసతుల విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారు. హస్నాబాద్ గ్రామం జిల్లాస్థాయితో పాటు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
చాలా సంతోషంగా ఉంది
హస్నాబాద్ గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అని సౌకర్యాలు సమ కూర్చేందుకు కృషి చేస్తున్నాం. వీటన్నింటి ప్రతి ఫ లం గా జిల్లా స్థాయి అవార్డు దక్కింది. రాష్ట్రస్థాయిలో జిల్లా నుంచి హస్నాబాద్ గ్రామం ఎంపిక కావడం మరింత ఆనందంగా ఉంది. అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. – ఫకీరప్ప, గ్రామ సర్పంచ్, హస్నాబాద్, కొడంగల్
అన్ని రంగాల్లో అభివృద్ధి
గతంలో కన్నా తెలంగాణ ప్రభుత్వ హయాంలో హస్నా బాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు, ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనంలో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా పరికరాల ఏర్పాటు, విద్యార్థులకు అందుబాటులో గ్రంథా లయం వంటి చాలా వరకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి, సర్పంచ్ ఫకీరప్ప కృషితోనే గ్రామంలో అభివృద్ధి సాధ్యపడింది. –గొల్ల కృష్ణ, హస్నాబాద్, కొడంగల్