ప్రశాంతంగా గ్రూప్ -1 పరీక్ష
గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరిగి పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 864 మంది అభ్యర్థులకుగాను 651 మంది హాజరయ్యారు. పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 504 మంది అభ్యర్థులకుగాను 381 మంది హాజ రయ్యారు.
- పరిగిలో 651, తాండూరులో 1135 మంది అభ్యర్థులు హాజరు
- పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
పరిగి, జూన్ 9: గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరిగి పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 864 మంది అభ్యర్థులకుగాను 651 మంది హాజరయ్యారు. పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 504 మంది అభ్యర్థులకుగాను 381 మంది హాజ రయ్యారు. పల్లవి కళాశాల పరీక్షా కేంద్రంలో 360 మంది అభ్యర్థులకుగాను 288 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పూర్తిస్థాయి తనిఖీల అనంత రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలకు పంపించారు. గ్రూప్ వన్ పరీక్షలకు ఐడెంటిఫికేషన్ అధికారులుగా గ్రామపంచాయతీ కార్యదర్శులను నియమించిన అధికారులు వెరిఫికేషన్ పూర్త యిన తర్వాత రెమ్యునరేషన్ ఇవ్వకుండానే పంపించారు.
పరిగిలోని పరీక్షా కేంద్రాల్లో పెద్దేముల్, యాలాల్ నుంచి వచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రా లకు చేరుకొని 11 గంటల వరకు విధులు నిర్వర్తించారు. గత శుక్రవారం సైతం శిక్షణా తరగ తులకు హాజరైన తమకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని వారు వాపోయారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 112 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఐడెంటిఫికేషన్ కోసం విధులు నిర్వర్తిం చగా 16 మంది రిజర్వులో ఉన్నట్లు తెలిసింది.
రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంపై అడిగితే మీకు రెమ్యునరేషన్ ఇవ్వాలని తమకు గైడ్లైన్స్ రాలేదని అధికారులు పేర్కొన్నారని పలువురు గ్రామపంచాయతీ కార్యదర్శులు తెలిపారు. మరోవైపు ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించిన ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే వారికి రెమ్యునరేషన్ ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు తగిన చర్యలు తీసుకొని ఆదివారం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తించిన తమకు రెమ్యునరేషన్ ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
యాలాల: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సింధు డిగ్రీ కళాశాల, సింధు బాలికల జూనియర్ కళాశాల, సిద్దార్ధ జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1488 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 1135 మంది హాజరయ్యారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

