మంచాల, జూలై 2 : మంచాల మండలం వివిధ గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. మండల పరిధిలోని జాపాల, మంచాల, ఆరుట్ల, పీసీతండా, లింగంపల్లి ప్రధాన రహదారి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆయా గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు నిత్యం మొక్కలకు నీరు పోయడంతో పాటు వర్షాలు కురువడంతో వృక్షాలుగా మారి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న వివిధ రకాల చెట్లు నీడతో పాటు ప్రకృతి రమణీయతను సంతరించుకున్నాయి.