Venugopala Swamy Kalyanam | మంచాల, ఫిబ్రవరి 11: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ ఆవరణలోని కళ్యాణ మండపంపై వేణుగోపాల స్వామి రుక్మిణి, సత్యభామ కళ్యాణం కనుల పండువగా జరిగింది. ఈ కళ్యాణం సందర్భంగా కళ్యాణ మండపంతోపాటు ఆలయాన్ని కొబ్బరి, మామిడి తోరణాలతోపాటు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ముందుగా దేవతామూర్తులను శుద్ధ జలం, పంచామృతంతో అభిషేకం చేశారు. దేవాలయ పురోహితుడు శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యభామల కళ్యాణం తిలకించేందుకు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తరలి వచ్చారు. కళ్యాణ అనంతరం దేవాలయ ఆవరణలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు