కొడంగల్, మే 24 : అన్నదాత కష్టం అకాల వర్షానికి వర్షార్పణమైంది. ధాన్యం కోతలు పూర్తై నెలరోజులు దాటినా వడ్లను ప్రభుత్వం కొనకపోవడంతో అన్నదాత వాటిని కల్లాలు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబోట్టి కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. తమది సీఎం ఇలాకా అని సంతోషపడేలే తప్ప ధాన్యాన్ని కొనడంలేదని పలువురు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు అధ్వానంగా ఉన్నాయని.. రైతులు పంటను రోడ్లు, కల్లాల్లో కుప్పలుగా పోసి కాపలా కాస్తూ.. వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ అవస్థలు పడుతున్నా రు. ఆదివారం కురిసిన అకాల వర్షానికి దుద్యాల మం డలంలోని పోలేపల్లిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ్లు వరద నీటిలో కలిసిపోయాయి.
తాండూరు : ధాన్యం రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు నత్తనడకన సాగుతున్న సేకరణ. మరోవైపు పగబట్టిన ప్రకృతి. గత రెండు రోజులుగా తాండూరు నియోజకవర్గంలో సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో కురుస్తున్న అకాల వర్షాలతో రోడ్లు, కల్లాలు, ఇండ్ల ఎదుట ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతున్నది. ట్రాక్టర్లలో మిల్లులకు తీసుకెళ్లిన ధాన్యం తడిసిపోతుండడంతో రైతులు బావురుమం టున్నారు. తూకాల్లో జాప్యంతో మండలంలోని గోనూర్, నారాయణపూర్, వీర్‌శెట్టిపల్లి గ్రామాల పరి ధిలోని రైతులు ఇంకా ధాన్యాన్ని ఆరబెడుతూనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లోని బాలాజీ రైస్‌మిల్ ఎదుట పదుల సంఖ్య లో ధాన్యంతో ఉన్న ట్రాక్టర్లు తూకం కోసం వేచి ఉ న్నాయి. ఒకవైపు మేఘాలు ఉరుముతుండగా మరో వైపు ధాన్యం ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నా యి. అలాగే, బషీరాబాద్ మండలంలోని కాసింపూర్ కొనుగోలు కేంద్రంలో ఆదివారం సాయంత్రం కురిసిన వానకు వడ్లు కొట్టుకుపోయాయి. మండలంలోని నారాయణపూర్, వీర్శెట్టిపల్లిలలోని వంతెనలపై ఆరబెట్టిన ధాన్యం కూడా వర్షార్పణమైంది.
కులకచర్ల : చౌడాపూర్ మండల కేంద్రంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం తడిసిపోగా.. దానిని కొనడంలేదని బీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చౌడాపూర్‌లోని కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కాంటా చేయకపోవడం తో అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయన్నారు. కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టడంతో అకాల వర్షాలకు తడుస్తున్నాయని.. ఆ వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వర్షాలు కురుస్తుండడంతో అధికారులు కొనుగోళ్లు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్, దాసు, మాజీ ఉపసర్పంచ్ శివకుమార్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మంచాల, మే 24 : రైతన్న పంటను అమ్ముకునేందుకు నానాకష్టాలు పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి అధికారులు కాంటా చేయకపోవడంతో.. కుప్పల వద్దే రోజుల తరబడి పడిగాపులు కాయా ల్సి వస్తున్నది. ప్రభుత్వం మండల కేంద్రంలో ఐకేపీ, బోడకొండ, లోయపల్లి మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. అక్కడికి విక్రయానికి అన్నదాతలు ధాన్యా న్ని తీసుకుపోగా.. కొనుగోళ్లు సక్రమంగా సాగకపోడంతో అక్కడ చూసినా ధాన్యం రాశుల కుప్పలే కనిపిస్తున్నాయి. రైతులు వడ్లను ఆరబెట్టి క్లీనింగ్ చేసి తూకం ఎప్పుడు వేస్తా రా..? అని ఎదురుచూస్తున్నారు. కాగా, మండలంలోని చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడిగా పడిగాపులు కాయడం ఇష్టం లేక వ్యాపారులకు తక్కువ ధర వచ్చినా విక్రయించి నష్టపోతున్నారు. అధికారులు స్పందించి వర్షాలు పడకముందే వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.