కేశంపేట, ఫిబ్రవరి 6 : గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేద్దామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, దేవునిగుడితండా, ఇప్పలపల్లి, తూర్పుగడ్డతండా, పాపిరెడ్డిగూడలో ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి పల్లె, పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని, పల్లెల అభివృద్ధికి పల్లెప్రగతి, పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పురోగతి సాధించామని తెలిపారు. కేశంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ, గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మించి, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందుతుండటంతో ఇక తాగునీటి సమస్య తీరి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గండ్ర లక్ష్మమ్మ, శంకర్‌నాయక్, లలిత, ఆంజనేయులు, విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, ఎంపీటీసీలు రమాదేవి, మల్లేశ్‌యాదవ్, మండల కోఆప్షన్ జమాల్‌ఖాన్, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, పీఆర్ఏఈ భూపాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, పర్వత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, వేణుగోపాలాచారి, రమేశ్‌గౌడ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.
పేదలందరికీ ప్రభుత్వ పథకాలు
కొందుర్గు : పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన రాజనర్సింహారెడ్డికి మంజూరైన రూ. 28వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నర్సింహులు, గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, హన్మంతు పాల్గొన్నారు.
తెలంగాణలో నీటి గోస లేదు
కొత్తూరు : తెలంగాణ రాష్ట్రంలో నీటి గోస లేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాటీ పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో ఎమ్మెల్యే నిధులు రూ.10 లక్షలతో వాటర్ ఫిల్టర్ పనులకు ఆదివారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపాలిటీ చైర్మన్ లావణ్యతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని తీమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్గౌడ్కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును, కుమ్మరిగూడకు చెందిన రామచంద్రయ్యకి రూ.29 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు భగవతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండే కృష్ణ, నాయకులు దేవేందర్‌యాదవ్, జనార్దన్‌చారి, యాదయ్య, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, యాదగిరి, ఆనంద్‌గౌడ్, కుమార్, బాల్‌రాజ్, శ్రీశైలం, రవినాయక్ పాల్గొన్నారు.