కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కవితకి రూ. 16వేలు, ముద్విన్ గ్రామానికి చెందిన రమేశ్‌కి రూ. 32వేలు, మాడ్గుల్ మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన రాజుకి రూ. లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్సీ వివరించారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రెడ్డి, సుమన్‌గౌడ్ పాల్గొన్నారు.