get together | ఆమనగల్లు, మే1 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని స్పందన కోచింగ్ సెంటర్లో 2001-2002 చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామ సమీపంలోని బీఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి గురువులు శివలింగం, చాంద్పాషాలను పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు.
దాదాపు 23 ఏండ్ల తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సరదాగా గడిపారు. ఈ సమ్మేళనంలో అప్పటి గురువులు శివలింగం, చాంద్‌పాషా, పూర్వ విద్యార్థులు వస్పుల మల్లేశ్, ఎర్రవోలు రాజు, నిరంజన్, తోట కృష్ణ, కిషోర్, శంకర్, వెంకటేశ్, స్వాతి, బ్రహ్మండ, చంద్రకళ, ఉమా, ఇందిర తదితరులు పాల్గొన్నారు.