కొత్త రేషన్ కార్డులు, ఫ్రీ కరెంటు ఎప్పుడిస్తరు
కొత్త రేషన్ కార్డులు, గృహ వినియోగదారులకు ఫ్రీ కరెంటు సరఫరాను ఎప్పటి నుంచి అమలు చేస్తారని బుధవారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు.
- మండల సమావేశంలో సమస్యల ప్రస్తావన
బొంరాస్పేట, ఫిబ్రవరి 14: కొత్త రేషన్ కార్డులు, గృహ వినియోగదారులకు ఫ్రీ కరెంటు సరఫరాను ఎప్పటి నుంచి అమలు చేస్తారని బుధవారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని రేషన్ కార్డులు ఇవ్వాలని తుంకిమెట్ల, చౌదర్పల్లి ఎంపీటీసీ సభ్యులు తిరుపతయ్య, నారాయణరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ సరఫరా ఎప్పటి నుంచి అమలు చేస్తారని సభ్యులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో 200 యూనిట్లలోపు కరెంటు వినియోగించే వారి వివరాలు సేకరిస్తున్నామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.
వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని, మార్చి నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా రోజు విడిచి రోజు సరఫరా చేసే అవకాశం ఉన్నందున గ్రామాల్లో అందుబాటులో ఉన్న బోర్లను బాగు చేసుకోవాలని మిషన్ భగీరథ ఏఈ రాఘవేందర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండలానికి ఉపాధిహామీ పథకంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 7.20 కోట్లు మంజూరయ్యాయని, మంజూరైన పనులను ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీదేవి ప్రత్యేకాధికారులకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించడానికి సీఎం రేవంత్రెడ్డి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని, దీనిద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 58 చెరువులను నింపుకునే అవకాశం కలుగుతుందని నీటిపారుదల శాఖ డీఈ కిరణ్కుమార్ అన్నారు.
మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారి తెలిపారు. సమావేశానికి ముందు ఇటీవల మృతిచెందిన ఎంపీవో పాండు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ షరీఫ్, అటెండర్ హేమలత, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ కుర్మయ్యల మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, బొంరాస్పేట, దుద్యాల తహసీల్దార్లు రవికుమార్, దాన య్య, మండల పరిషత్ సూపరింటెండెంట్ వెంకన్గౌడ్, ఆయా శాఖల అధికారులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

