తుర్కయంజాల్, ఆగస్టు 15 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 1500 ప్రత్యేక గాంధీ విగ్రహాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన గాంధీ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ తరం పిల్లల్లో ప్రేరణ కలగాలి అనే ఉద్దేశంతో గాంధీ విగ్రహాల ప్రదర్శన చేసినట్లు తెలిపారు. ఒకే స్కూల్ లో 1500 గాంధీ విగ్రహాలు ప్రదర్శించినందుకు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ స్కూల్ నిర్వాహకులకు ప్రత్యేక మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్లోక స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సంగమేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.