Monkey | కడ్తాల్, ఏప్రిల్ 15 : నిత్యం గ్రామంలో జనాల మధ్య తిరిగే వానరం ఆకస్మికంగా మరణించింది. దీంతో గ్రామస్తులు మనోవేదనకు గురయ్యారు. వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కడ్తాల్ మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
రావిచేడ్ గ్రామంలో కొన్ని రోజులుగా వానరం తిరుగుతూ అందరితో కలిసి మెలిసి ఉండేది. గ్రామస్తులు ఆహారం అందిస్తే తీసుకునేదే కానీ బలవంతంగా ఎవరి వద్ద నుండి లాక్కునేది కాదు ఆ వానరం. మంగళవారం ఉదయం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో వానరం ఆకస్మాత్తుగా చనిపోయింది. విషయం తెలుసుకున్న సీతారామాంజనేయస్వామి భజన మండలి సభ్యులు, గ్రామస్తులు కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. వానరాన్ని బ్యాండ్ మేళాతో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక స్మశాన వాటికలో ఖననం చేశారు.