షాద్నగర్టౌన్, మార్చి 14 : ప్రభుత్వం సూచించిన విధంగా పట్టుసాగు చేస్తున్న రైతులకు సంపూర్ణ సహకారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పట్టుసాగు రైతులకు ప్రోత్రాహక ఆర్థిక సాయం అందకపోవడంతో బాధపడుతున్నారని, వారికి తగిన ఆర్థిక సాయం అందించే విధంగా చూడాలని మంత్రిని కోరారు.
అదే విధంగా అయిల్ఫాం తోటలను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండించే అవకాశం ఉందా, అయిల్ఫాం సాగుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందని మంత్రిని కోరారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి ఎవరు ఊహించని విధంగా రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడిసాయం, రైతు బీమా, 24నిరంతర విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.