కుత్బుల్లాపూర్, అక్టోబర్ 10: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెంటే తామంతా నడుస్తామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హమాలీ యూనియన్ సంఘం ప్రతినిధులు, కార్మికులు ప్రకటించారు. వివేకానంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో హమాలీ అడ్డా కూలీల కోసం హామాలీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని హమాలీ యూనియన్ సంఘం ప్రతినిధులు, కార్మికులు వందలాది మంది పేట్ బషీరాబాద్‌లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, హమాలీ అడ్డా కూలీల సమస్యలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు విన్నవించగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక వాడలో హమాలీ భవనం ఏర్పాటుకు స్థలం కేటాయించారని తెలిపారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఎమ్మెల్యే వివేకానంద్‌కు తామంతా రానున్న ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన పత్రాన్ని వివేకానంద్‌కు అందజేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారినికి నిరంతరం కృషి చేస్తున్న వివేకానంద్ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగామని, రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాల కల్పనకు నిరంతరాయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ సంఘాల భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, అభివృద్ధి ఫలాలను ఇప్పుడు మనం కండ్లారా చూస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో హమాలీ భవన్లో వంటశాల, భోజన శాల, విశ్రాంతి గదులు, సమావేశ హాలు, తదితర వసతులతో విశామైలన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ యూసూఫ్, సీఐటీయూ కుత్బుల్లాపూర్ మండల నాయకులు కీలుకాని లక్ష్మణ్, అంజయ్య, స్వామి, శ్రీనివాస్, శేఖర్, అశోక్‌రెడ్డి, దేవదానం, బీరప్ప, సునీల్, తిమ్మప్ప, అంజనేయులు పాల్గొన్నారు.