కొండాపూర్, మే 22 : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొండాపూర్ పోలీసు బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ బీవీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కొండాపూర్లోని 8వ పోలీస్ బెటాలియన్లో మెగా డెంటల్ దవాఖాన ఆధ్వర్యంలో కమాండెంట్ రామకృష్ణ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా నిత్యం విధులలో బిజీగా ఉండే పోలీసులు వ్యాయామాలు చేస్తూ, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.