తుర్కయాంజాల్, జూలై 1 : ఒక పక్క ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తుండగా.. మరో పక్క తమకు న్యాయం చేయాలని, తమ భూమిలో శంకుస్థాపన ఎలా చేస్తారని వచ్చిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మునగనూర్ సర్వే నంబర్ 44/1లో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి రూ.5 లక్షలు, కలెక్టర్ ద్వారా రూ. 10 లక్షలు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నిధుల నుంచి మరో రూ.10 లక్షలు అందించనున్నట్లు ఆయన చెప్పారు.
అంతకుముందు ఇబ్రహీంపట్న ఎమ్మెల్యే రంగారెడ్డి పలు చోట్ల అభివృద్ధి పనులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో సర్వేనంబర్ 44/1లో తమకు ప్లాట్లు ఉన్నాయని.. ఆ స్థలంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని నిర్మించొద్దంటూ పలువురు డాక్యుమెంట్లు పట్టుకుని మంత్రి పొన్నంను కలిసేందుకు కార్యక్రమం వద్దకు రాగా హయత్‌నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాకు తరలించారు. కాగా, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ వారిని తిరిగి తీసుకు రమ్మని చెప్పడంతో పోలీసులు సర్వేనంబర్ 44/1 వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సర్వేనంబర్ 44/1లో ఉన్న సమస్యలను వారికి వివరించారు.
2007లో ఈ సర్వేనంబర్‌లో చేసిన రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేసినట్లు చెప్పగా.. ప్లాట్ల యజమానులు తమకు న్యాయం చేయాలని కోరారు. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకొస్తే న్యా యం జరిగేలా చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చా రు. అనంతరం బాధితులు మంత్రి పొన్న ప్రభాకర్‌ను కలిసి తమకు న్యా యం చేయాలని వినతిపత్రాన్ని అందించిగా.. స్పం దించిన ఆయన సర్వేనంబర్ 44/1లో ప్లాట్లు ఉన్నట్లు డాక్యుమెంట్లుం టే కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.