షాబాద్, జూలై 8 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి కలిశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో బహిరంగ చర్చకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మద్దతుగా షాబాద్ మండలం నుంచి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నగరంలోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు.
అనంతరం కేటీఆర్ ను పట్నం అవినాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరి, మాట నిలబెట్టుకోకుండా ఢిల్లీకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని, తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు, పార్టీ నాయకులు ఇమ్రాన్, మధుకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, ముక్రంఖాన్, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శశాంక్‌రెడ్డి, అజయ్, మయూర్ తదితరులున్నారు.