వికారాబాద్, జూలై 25 : రాష్ట్ర విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్న ఆ శాఖ మంత్రి రేవంత్రెడ్డి కూడా రాజీనామా చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాబలం ముందు ఎంతటి బలవంతులైనా తలవంచక తప్పదని మరోసారి నిరూపితమైందన్నారు. విద్యార్థుల ధర్నాలతో కేంద్రం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్తో రాజీనామా చేయించడం శుభసూచికమన్నారు.
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబానికి రూ. కోటి చొప్పు న పరిహారం అందించాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాతో దేశం మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన జెన్జీ దెబ్బకు కేంద్రానికి పట్టిన దెయ్యం వదిలిందన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితులే రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఎందుకంటే రేవంత్రెడ్డి పాలన అంత బ్రహ్మాండంగా ఉందని ఎద్దేవా చేశారు.