బీఆర్ఎస్ గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ..
- మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి
తాండూరు, ఏప్రిల్ 19: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరిని ఒక్కతాటికి తీసుకొచ్చిన చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అం దరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు.
పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ ఘన విజ యం సాధించిందన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కూడ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
నట్టేట ముంచుతున్న కాంగ్రెస్

తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచుతుందని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రె స్ ఒక్కటై ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌తో తాండూరుకు ఒరిగిందేమిలేదన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత పదవులు అనుభవించిన నాయకులు నేడు పార్టీలు మార డం విడ్డూరంగా ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి బీఆర్ఎస్ ఓటమికి కారణమైన వ్యక్తులను ఎన్నటికీ ఎక్కడ గెలవనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మోసం చేసిన ద్రోహులను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన మంచి మనసున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు తాండూరు నియోజక వర్గం భారీ మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు శ్రీశైల్‌రెడ్డి, రాజుగౌడ్, నర్సిరెడ్డి, శకుంతల, వీరేందర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

