ఆదిబట్ల, డిసెంబర్ 10 : ఎన్నికల సమయంలో మీరు చే సిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగుళూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పక్షమైనా.. ప్రతి పక్షమైనా.. నిరంతరం ప్రజల పక్షానే ఉంటూ వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు రాత్రనక, పగలనక తమ కుటుంబాలకు దూరంగా ఉం టూ కృషి చేసిన నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. అయితే ఫలితం మరోలా వచ్చిందని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేద్దామన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రూ. 2,931 కోట్లతో అభివృద్ది పనులు చేశామని గుర్తు చేశారు. ఈసారి గెలవనందుకు బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలు, నాయకులకు ధైర్యం చెప్పారు. ప్రజల సమ స్యల కోసం పోరాడుదామన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తేదీన రైతుబంధు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వరి ధా న్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చె ప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రస్తావనే లేదన్నారు. రాబో యే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని కోరారు.
ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఓటమిని తట్టుకోలేక యా చారం జడ్పీటీసీ చిన్నోల జంగమ్మ కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేశాం.. కానీ ప్రజలు కాంగ్రెసోల్ల మాయ మాటలు నమ్మారని అన్నారు. చీమకు కూడా హాని చేయని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఈ నియోజక వర్గం ప్రజలు చేసుకున్న పాపమన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చందయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, పట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, దండెం రాంరెడ్డి, జక్కా రాంరెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు చీరాల రమేశ్, కర్నాటి రమేశ్, చిలుకల బుగ్గరాములు, వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.