పరిగి, ఏప్రిల్ 3 : పేద రైతుల భూములు గుంజుకుం టూ సర్కారు రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కారు అనేకచోట్ల భూములు గుంజుకుంటూ రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. సర్కారు వద్దే వేలాది ఎకరాలున్నా మళ్లీ భూసేకరణ చేయడం ఎందుకని ప్రశ్నించారు. కాళ్లాపూర్, రాపోల్ రైతులు భూములు కోల్పోకుండా వారి వెంట ఉండి బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే కాళ్లాపూర్, రాపోల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పర్యటించి రైతులకు బాసటగా నిలుస్తారన్నారు.
శుక్రవారం మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామా ల్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణలో భూ ములు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే దీక్షలో వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి సబితాఇంద్రారెడ్డి పా ల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళ్లాపూర్, రాపోల్ గ్రా మాల్లో భూసేకరణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని.. రైతుల గోడు, మహిళల ఏడుపు చూస్తే తన గుండె బరువెక్కిందని.. మహిళా రైతుల రోదనలు మంచిది కాదన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని అనుకుంటే అర్ధాంతరంగా సమావేశాలను వా యిదా వేసిందన్నారు. రైతుల భూములను సర్కారు గుంజుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్‌రావు కాళ్లాపూర్, రాపోల్ గ్రామాలకు వస్తారని, ఆ తర్వాత కేటీఆర్ వస్తారని.. రైతులు అధైర్యపడకుండా సంఘటితంగా ఉండాలన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని గోశాలకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకొని.. గోశాలకు ఎన్కెపల్లిలో భూములు ఇవ్వాలని నిర్ణయిం చి రైతులను విడదీసి విడతల వారీగా భూములను తీసుకుందన్నారు. ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకుంటే సరి, లేదంటే ఎంతవరకైనా పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల భూములు ప్రభు త్వం వద్ద ఉన్నాయన్నారు.
రాష్ర్టానికి పెట్టుబడులొస్తే ఇప్పుడున్న చందనవెల్లి, సీతారాంపురంలోని వెయ్యి ఎకరాలు, మోమిన్‌పేటలో వెయ్యి ఎకరాలు, రాకంచర్లలో 200 ఎకరాల భూములున్నాయని, ముందుగా వాటిలో కంపెనీలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. అవన్నీ వదిలేసి పేదల భూములను లాక్కొని సర్కారు రాక్షసానందం పొందుతున్నదని మండిపడ్డారు. రైతులు కన్నీరు పెడితే రాష్ర్టానికి మంచిది కాదన్నారు. రైతులు భూములను పడావు పెట్టొద్దని.. దున్ని సాగు చేయాలని.. పోలీసులు వస్తారా..? కలెక్టర్ వస్తారా..? స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆపుతారో చూద్దామన్నారు. కేసులు పెడితే ఏమి కాదని, తాము అండగా ఉంటామన్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇప్పటికే 50 వేల ఎకరాల వరకు రైతులను భయపెట్టి గుం జుకొని ఉంటారని సబితారెడ్డి ఆరోపించారు. రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన, ప్రజాపాలనా అని ప్రశ్నించారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుందని .. ఏ సమస్య వచ్చినా మహేశ్‌రెడ్డి మీతో ఉంటారని, నాకు చిన్న మెసేజ్ పెడితే చాలు అర్ధరాత్రైనా వస్తానని అభయమిచ్చారు. అన్నదాతల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో ఆలోచించేవారని గుర్తు చేశారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఎన్నికల్లో చెప్పిన రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించి భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. రైతుల తరఫున పోరాటం చేస్తున్న కాళ్లాపూర్ సర్పంచ్‌ను సబితారెడ్డి అభినందించారు. ఈ సం దర్భంగా మహిళా రైతులు ఏడవడంతో వారిని సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసీ నాగారెడ్డి, పరిగి మాజీ ఎంపీపీ అరవిందరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, కాళ్లాపూర్ సర్పంచ్ పుల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, జగన్, రవికుమార్, కృష్ణ, రవి, జంగయ్య, జం గయ్య, శశాంక్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
భూముల చుట్టూ తిరుగుతున్న సీఎం
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు లగచర్ల, హైడ్రా, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్‌సిటీ, ఖమ్మంలోని భూముల చుట్టూ సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారు. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి భూములు తప్ప మనుషులు కనిపించడం లేదు. ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేయాలి కానీ, ఉన్న భూములను గుంజుకొని ప్రజల ను కష్టాల్లోకి నెట్టడం సరికాదు. బంగ్లాదేశ్, శ్రీలంకలలో దేశ అధ్యక్షులను ఉరికించిన సందర్భాలను చూశాం. త్వరలో తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డిని ఉరికించే పరిస్థితి వస్తుంది. మంచిగా చేస్తారని ప్రజ లు అవకాశమిస్తే వారి వెనుకే గొయ్యిలు తవ్వుతున్నారు. ఓ వైపు రెండు గ్రామాల ప్రజలు భూములు తీసుకోవద్దని ఆందోళన చేస్తుండగా దోమ మండలంలోనూ భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఎమ్మెల్యే స్వగ్రామం శివారెడ్డిపల్లిలోనూ భూసేకరణ చేస్తారని ప్రచారంలో ఉందన్నారు. రైతులు భయపడొద్దని.. కోర్టుల్లో కొట్లాడేందుకు పార్టీ తరపున సంపూర్ణ సహకారం ఉంటుంది.
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
రైతులు అధైర్యపడొద్దు
రైతులు అధైర్యపడొద్దు. మీ వెంట బీఆర్ఎస్ ఉండి పోరాడు తుంది. ఇండస్ట్రియల్ పార్కుకు రైతుల భూములు లాక్కొంటే సహించేది లేదు. కాళ్లాపూర్, రాపోల్లలో భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిందని తెలిసి రైతులు తమ భూములను లాక్కోవద్దని కలెక్టర్‌ను కలిసి రాతపూర్వకంగా వినతిపత్రాన్ని ఇచ్చి 11 రోజులైనా ఎలాంటి స్పందన లేదు. రెండు గ్రామాల్లోనూ భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలి. రాకంచర్లలో 25 ఏండ్ల కిందట భూములు తీసుకుంటే ఇప్పటివరకు 25శాతం కంపెనీలు కూడా రాలేదు. మోమిన్‌పేట మండలంలోని ఎన్కతలలో వెయ్యి ఎకరాల భూములు సేకరించినా ఇప్పటివరకు అక్కడ కంపెనీలనే ఏర్పాటు చేయ లేదు. ముందుగా ఉన్న భూముల్లో కంపెనీలను ఏర్పాటు చేసి ఆ తర్వాతే భూములను సేకరించాలి. రెం డు గ్రామాల రైతులు తమ భూములను ఇవ్వబోమని గత 11 రోజులుగా రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం దారుణం. -కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి
సాగు భూములను తీసుకుంటారంట..
మా గ్రామంలోని పట్టాభూములను లాక్కొనేందుకు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట 235 ఎకరాల పట్టాభూమి, 12.30 ఎకరాల అసైన్డ్ భూముల్లో కంపెనీలు పెడతారంట. మా గ్రామంతోపాటు కొండాయపల్లి, అనంతరెడ్డిపల్లి గ్రామాల్లోనూ భూములను సేకరిస్తామని నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగాలు లేక హైదరాబాద్‌లో ఉండి పనిచేసుకుంటూ ఇటీవలె వ్యవసాయం చేసుకుంటున్నా. ఉన్న భూమి గుంజుకుంటే ఎక్కడికి వెళ్లాలి. ఎలా బతకాలి..? మా భూములు ఇచ్చేది లేదు. భూములను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం. రేవంత్ సర్కారు భూ దందా చేస్తున్నది. ఎమ్మెల్యే చాటుగా దాక్కొని ఇలాంటివి చేయడం సరికాదు.
-తిరుమలేశ్, రైతు, బట్లచందారం, దోమ
భూములు పోకుండా చూడాలని వినతి
దోమ : ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కొనేందుకు నోటిఫికేషన్ జారీ చేసింద ని, తమ భూములు పోకుండా చూడాలని దోమ మం డలంలోని బట్లచందారం గ్రామ రైతులు సబితా ఇం ద్రారెడ్డిని కోరారు. శుక్రవారం రాపోల్లో ఆమెను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.