రుణాల రికవరీపై నజర్
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని సంఘాల నుంచి రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడంలేదు.
- వికారాబాద్ జిల్లాలో పనిచేయని స్వయం సహాయక సంఘాలు 705
- వాటి నుంచి రావాల్సిన బకాయిలు రూ.18.85 కోట్లు
- మొండికేసిన సంఘాల నుంచి రుణాల రికవరీపై అధికారుల ప్రత్యేక చర్యలు
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎస్‌హెచ్‌జీలకు రూ.539 కోట్ల రుణాలు మంజూరు
వికారాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని సంఘాల నుంచి రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడంలేదు. జిల్లాలో 12,471 స్వయం సహాయక సంఘాలుండగా..ఈ ఏడాది ఇప్పటివరకు రూ.539 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 705 స్వయం సహాయక సంఘాలు మొండికేయడంతో రూ. 18.85 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నా రు. ఈ మొత్తాన్ని సంఘాల నుంచి వసూలు చేసేందుకు డీఆర్డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది. రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ మంజూ రు చేయొద్దని బ్యాంకు అధికారులకు సూచించారు.
పెండింగ్‌లో రూ.18.85 కోట్ల బకాయిలు
జిల్లాలోని 705 స్వయం సహాయక సంఘాల నుంచి రూ.18.85 కోట్ల బకాయిలను రికవరీ చేయాల్సి ఉన్న ది. మొండికేసిన సంఘాల నుంచి రుణాలను రికవరీ చేయడంతోపాటు సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పనిచేయని సంఘాలను తిరిగి యాక్టివ్‌గా పనిచేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు మొండికేసిన సంఘాల్లో మార్పు తీసుకొచ్చి బకాయిలను వసూలు చేసే పనిలో అధికారులున్నారు. కాగా, తాండూరు, పూడూరు, పెద్దేముల్, ధారూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి.
యాలాల మండలంలో 57సంఘాల నుంచి రూ. 1.71 కోట్లు, పరిగిలో 18 సంఘాల నుంచి రూ. 55.88 లక్ష లు, దోమలో 50 సంఘాల నుంచి రూ.1.24కోట్లు, బంట్వారంలో 10 సంఘాల నుంచి రూ.3.63 లక్షలు, కోట్‌పల్లిలో 5 సంఘాల నుంచి రూ.6.38 లక్షలు, తాండూరులో 76 సంఘా ల నుంచి రూ.2.37 కోట్లు, మోమిన్‌పేటలో 27 సంఘాల నుంచి రూ.70.48 లక్షలు, పెద్దేముల్లో 63 సంఘాల నుంచి రూ.2.41 కోట్లు, మర్పల్లిలో 53 సంఘాల నుంచి రూ.1.17 కోట్లు, ధారూరులో 50 సం ఘాల నుంచి రూ.1.22 కోట్లు, బషీరాబాద్‌లో 51 సంఘాల నుంచి రూ.1.30 కోట్లు, బొంరాస్‌పేటలో 26 సంఘాల నుం చి రూ.1.04 కోట్లు, పూడూరులో 46 సంఘాల నుంచి రూ.2, 26 కోట్లు, వికారాబాద్‌లో 28 సంఘాల నుంచి రూ.54.39 లక్షలు. కొడంగల్‌లో 25 సంఘాల నుంచి రూ.43.91 లక్షలు, చౌడాపూర్ మండలంలో 9 సంఘాల నుంచి రూ.20.01 లక్షల బకాయిలను వసూలు చేయాల్సి ఉన్నది.
రూ. 539 కోట్ల రుణాలు మంజూరు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు సం ఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ వారికి వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణా షాపులు, గేదెలు, గొర్రెలు, మేకలు కొనేందుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 547 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 98.54% మేర మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.547 కోట్లకుగానూ రూ.539 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ఎస్‌హెచ్‌జీలకు అందజేసింది.
బకాయిలు వసూలు చేస్తాం
జిల్లాలో మొండికేసిన సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు తగు చర్యలు చేపట్టాం. జిల్లాలో ఎన్పీఏ సంఘాలను గుర్తించి పెండింగ్ బకాయిలను వసూలు చేస్తాం. అదేవిధంగా యాక్టివ్‌గా పనిచేయని సంఘాల్లో మార్పు తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడతాం. పెండింగ్ బకాయిలున్న సంఘాలకు రుణాల ను మంజూరు చేయకుండా ఇప్పటికే బ్యాంకర్లకు సూచించాం.
– శ్రీనివాస్, డీఆర్డీవో
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- loan recovery
- loans
- SHGs
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

